Prathyardhi Review: ప్రత్యర్థి మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

Prathyardhi Movie Review: శంకర్ దర్శకుడిగా పరిచయమవుతూ రోహిత్ బెహల్, అక్షత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ప్రత్యర్థి మూవీ జనవరి 6వ తేదీన విడుదలైంది, ఆ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 6, 2023, 01:06 PM IST
Prathyardhi Review: ప్రత్యర్థి మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

Prathyardhi Movie Review: ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది, చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమాని ఆదరించడానికి అయినా ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలను కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. తాజాగా అదే విధంగా పూర్తిగా కొత్త వారితో ఒక సినిమా రూపొందింది. ప్రత్యర్థి అనే పేరుతో జనవరి ఆరో తేదీన ఈ సినిమా విడుదలైంది. టీజర్, ట్రైలర్తో సినిమా మీద అంచనాలు పెంచేలా చేసుకున్న ప్రత్యర్థి మూవీ ఎలా ఉంది అనేది సమీక్షలో చూద్దాం.

ప్రత్యర్థి కథ ఏమిటంటే?
హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసే కృష్ణ ప్రసాద్(రవివర్మ)కి ఒక కేసు వస్తుంది .తన భర్త కనిపించడం లేదు అంటూ వైశాలి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అయితే ఆమె భర్త విజయ్ కు ఏం జరిగింది? విజయ్ ను ఎవరైనా కిడ్నాప్ చేశారా? విజయ్ ఇంట్లో ఉన్న రక్తం ఎవరిది? అనే కోణంలో కృష్ణ ప్రసాద్ దర్యాప్తు మొదలు పెడతాడు. అయితే అదే అపార్ట్మెంట్లోకి ముగ్గురు ముసుగు వ్యక్తులు వెళ్లారని సయ్యద్ అనే ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విజయ్ ను చంపింది వీరే అంటూ మెకానిక్ శివ(రోహిత్ బెహల్), శశి, రాకేష్(బ్లవీందర్ సింగ్) అనే ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. అయితే కోర్టులో వాదనలు జరుగుతుండగా ఈ కేసు కీలక మలుపు తిరుగుతుంది. చంపింది వారు కాదు, వేరే వ్యక్తి అని తెలుస్తుంది. దీంతో అసలు విజయ్ ఎలా మిస్ అయ్యాడు? విజయ్ మిస్ అవ్వడానికి గల కారణం ఈ ముగ్గురేనా? కృష్ణ ప్రసాద్ కుమార్తెను గన్ తో కాల్చిందెవరు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ 
ఈ సినిమా విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో మర్డర్ మిస్టరీ సినిమాలు మంచి హిట్ లుగా నిలుస్తున్నాయి.  ప్రేక్షకుడిని థియేటర్లకు అతుక్కునేలా కూడా చేస్తున్నాయి. అదే నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రత్యర్థి మూవీ కూడా ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. విజయ్ అనే వ్యక్తి మిస్ అవ్వడం, అతనికి ఏం జరిగింది అంటూ అతని గురించి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టడంతో సినిమా మొదలవుతుంది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ కేసు మీద ఆసక్తి తగ్గాల్సింది పోయి ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఏది ఫ్లాష్ బ్యాక్? ఏది ప్రస్తుతం? అనే విషయాన్ని ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు తెరకెక్కించలేకపోయారు. కచ్చితంగా సినిమా చూసే ప్రేక్షకుడు ఇప్పుడు జరుగుతున్నది ప్రస్తుతమా? లేక ఫ్లాష్ బ్యాకా అనే మీమాంసలో ఉండిపోతాడు. ఒక చక్కని ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ రాసుకున్నాడు దర్శకుడు. అప్పటివరకు బాగానే సాగిన కథకు కొంతవరకు ఇంటర్వెల్ తర్వాత కూడా కొంత కన్ఫ్యూజన్ కి గురయ్యేలా సాగుతుంది. అయితే ఎట్టకేలకు సినిమాలో ఉన్న ట్విస్టులతో ప్రేక్షకుడిని చివరికి సాటిస్ఫై చేసి థియేటర్ నుంచి బయట అడుగుపెట్టేలా చేశాడు దర్శకుడు. కథపరంగా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే విషయంలో తేడా పడడంతో సినిమా మొత్తం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. 

 

నటీనటుల విషయానికి వస్తే
సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన అద్దూరి రవివర్మ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. గతంలోనే ఆయన ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు కానీ ఇది ఒక రకంగా ఆయనకు ఫుల్ లెన్త్ రోల్ అని చెప్పాలి. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా క్లైమాక్స్ వరకు కనిపించిన రవి వర్మ చివరిలో మాత్రం అతని వెనుక ఉన్న అసలు నిజ స్వరూపం బయటపడటంతో మరింత రెచ్చిపోయి నటించారు. ఇక హీరో హీరోయిన్లుగా నటించిన రోహిత్ బెహల్, అక్షత వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బల్వీందర్ సింగ్ ప్రతి డైలాగ్ కి థియేటర్లో మంచి రెస్పాన్స్ అయితే లభించింది. అదే విధంగా తోటపల్లి మధు, దివంగత టీఎన్నార్, తాగుబోతు రమేష్, వంశీ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం విషయానికి
ఈ సినిమాలో టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు శంకర్ కొత్తవాడైనా చాలా సీన్స్ మాత్రం ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. సినిమాటోగ్రఫీ కూడా బాగా సెట్ అయింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగినట్లు బాగున్నాయి. సినిమాలో డైలాగ్స్ బాగా కుదిరాయి. అదే విధంగా సినిమాకి సంబంధించిన సంగీతం, నేపథ్య సంగీతం కూడా బాగా సెట్ అయ్యాయి.

ఫైనల్గా 
ప్రత్యర్థి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ ఒక కన్ఫ్యూజ్డ్ మర్డర్ మిస్టరీ.
Rating:2.75/5
Also Read: Ramya Raghupathi Shocking Video: కృష్ణ చనిపోయిన నైట్ నరేష్- పవిత్ర మిస్సింగ్.. అనాధలా కృష్ణ పార్థివదేహం?

Also Read: Varisu Art director: సినిమా విడుదలకు వారం ముందు విషాదం.. 'వారసుడు' ఆర్ట్ డైరెక్టర్ మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News