వివాదంపై స్పందించిన ప్రియ ప్రకాష్ వారియర్

బాలీవుడ్‌పై కన్నేసిన ప్రియ ప్రకాశ్ వారియర్ 

Last Updated : Feb 16, 2018, 11:57 AM IST
వివాదంపై స్పందించిన ప్రియ ప్రకాష్ వారియర్

కేరళ యువ నటి ప్రియ ప్రకాశ్ వారియర్ నటించిన అప్‌కమింగ్ సినిమా నుంచి ఇటీవల విడుదలైన మానిక్య మళరాయ పూవి పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాటలో పలు పదాలు ముస్లిం మనోభావాలు కించపర్చేలా వున్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాట కాస్త వివాదాస్పదమైంది. హైదరాబాద్‌లో ఈ పాట వివాదం నేపథ్యంలో ప్రియ ప్రకాశ్ వారియర్‌పై కేసు కూడా నమోదైంది.

అయితే, ఈ వివాదంపై స్పందించిన ప్రియ ప్రకాశ్ వారియర్.. పాట వివాదం గురించి మొదలుకుని ఆ పాట వెనుకున్న వ్యక్తులు, తన కెరీర్ వరకు ఎన్నో అంశాలని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఈ దృశ్యాన్ని షూట్ చేసే సమయంలో డైరెక్టర్ ఒమర్ లులు ఒక్కటే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. "ఈ దృశ్యం చూసేవారికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురజ్ఞాపకంగా గుర్తుండిపోవాలి" అని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే నటించాం. కానీ అప్పుడు అనుకోలేదు ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని ఆశ్యర్యం వ్యక్తంచేసిందామె.

కెరీర్ గురించి ప్రియ మాట్లాడుతూ.. తనకు సినిమాల్లోకి రావాలనేది చిన్నప్పటి నుంచి వున్న కల. కానీ ఇలా మొదటి సినిమాతోనే ఇంత పాపులర్ అవుతానని అనుకోలేదు. అయితే తనకు ఇలా ఓ కొంటె పిల్లగా పేరు తెచ్చుకోవడం కన్నా.. మంచి నటిగా పేరు తెచ్చుకోవడం అంటేనే ఇష్టం అని కెరీర్ గురించి ఇంకా చాలా సంగతులే చెప్పుకొచ్చింది. 

 

బాలీవుడ్‌పై కన్నేసిన ప్రియ ప్రకాశ్ వారియర్ :
సినిమాల్లో తనకి ఇష్టమైన నటీనటుల గురించి స్పందిస్తూ.. దీపికా పదుకునె, రణ్‌వీర్ సింగ్, షారుఖ్ ఖాన్ లాంటి నటీనటులు తనకి బాగా ఇష్టం అని చెప్పిన ప్రియ ప్రకాశ్.. " తాను దీపికా పదుకునెతో కలిసి నటించాలి" అని కోరుకుంటున్నట్టు స్పష్టంచేసింది. బాలీవుడ్ సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని వుందని ప్రియ ప్రకాశ్ తన మనసులో మాటను బయటపెట్టింది. 

వివాదంపై స్పందన:
పాట వివాదంపై స్పందించిన ప్రియ ప్రకాశ్ వారియర్.. ఆ విషయం గురించి తనకు అంత పరిజ్ఞానం లేదని స్పష్టంచేసింది. మానిక్య మళరాయ పూవి పాట వివాదం రేపడంతోపాటు, సోషల్ మీడియాలో ఓ సంచలనంగా మారడంపై టీవీ ఛానెల్స్‌తో మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన అంశాలన్ని వెల్లడించింది ప్రియా ప్రకాశ్ వారియర్. 

మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ కేరళ కుట్టి బాలీవుడ్ ఎంట్రీ లక్ష్యం నెరవేరడానికి పెద్ద కష్టమేమి కాదనే అనిపిస్తోంది. ప్రియ మనసులో మాట తెలిసిపోయింది కనుక... త్వరలోనే ఎవరో ఒక బాలీవుడ్ ఫిలింమేకర్ ఆమెకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. 

Trending News