Chitfund scam: ప్రముఖ నిర్మాతకు హై కోర్టు నోటీసులు

తమిళనాడులో సంచలనం సృష్టించిన చిట్ ఫండ్స్ కుంభకోణం కేసులో చిట్ ఫండ్స్ నిర్వాహకులతో జ్ఞానవేల్ రాజాకు ( Gnanavel Raja ) కుడా సంబంధం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి రామనాధపురం పోలీసు స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైంది.

Last Updated : Jul 25, 2020, 04:26 AM IST
Chitfund scam: ప్రముఖ నిర్మాతకు హై కోర్టు నోటీసులు

తమిళ, తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన పేరు జ్ఞానవేల్ రాజా ( Producer Gnanavel Raja). నటుడు సూర్యకు సమీప బంధువైన జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలను నిర్మించాడు. అందులో కొన్ని సినిమాలు తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కాగా.. ఇంకొన్ని చిత్రాలు తమిళంలో సూపర్ హిట్ అయిన అనంతరం తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. అలా తెలుగు వారికి సుపరిచితుడైన జ్ఞానవేల్ రాజా తమిళనాట ప్రస్తుతం రూ. 300 కోట్ల చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో ( 300 cr chit fund case ) నిందితులలో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

తమిళనాడులో సంచలనం సృష్టించిన చిట్ ఫండ్స్ కుంభకోణం కేసులో చిట్ ఫండ్స్ నిర్వాహకులతో జ్ఞానవేల్ రాజాకు ( Gnanavel Raja ) కుడా సంబంధం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి రామనాధపురం పోలీసు స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ తాజాగా మద్రాస్ హై కోర్టు ( Madras High court ) జ్ఞానవేల్ రాజాకు నోటీసులు జారీచేసింది. 

ఇదిలావుంటే, చిట్ ఫండ్స్ కేసుతో తన పేరును ముడిపెడుతూ వస్తున్న వార్తా కథనాలపై జ్ఞానవేల్ రాజా చాలా ఘాటుగా స్పందించారు. రూ. 300 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంస్థకు తనకు మధ్య వ్యాపార లావాదేవీలు తప్ప వ్యక్తిగత సంబంధాలు లేవని.. ఆ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా ( Defamation suit ) వేయడానికి సిద్ధమవుతున్నట్టు జ్ఞానవేల్ రాజా తెలిపాడు.

Trending News