Puneeth Rajkumar: ఇప్పటికీ సీక్రెట్‌గానే... పునీత్ లేడనే విషయం మేనత్తకు తెలియదు...

Puneeth Rajkumar aunt stil unware of his death: పునీత్ మరణించి నెలలు గడుస్తున్నా.. ఆయన మరణించారనే విషయం ఇప్పటికీ పునీత్ మేనత్తకు తెలియదట.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 07:59 PM IST
  • పునీత్ రాజ్‌కుమార్ మరణించారనే విషయం ఇప్పటికీ ఆయన మేనత్తకు తెలియదు
  • సీక్రెట్‌గా ఉంచుతున్న కుటుంబం.. తెలిస్తే తట్టుకోలేరని..
  • పునీత్ అంటే మేనత్తకు అమితమైన ప్రేమ
Puneeth Rajkumar: ఇప్పటికీ సీక్రెట్‌గానే... పునీత్ లేడనే విషయం మేనత్తకు తెలియదు...

Puneeth Rajkumar aunt stil unware of his death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం చెంది దాదాపు నాలుగున్నర నెలలు గడిచిపోయింది. పునీత్ మరణించారంటే ఇప్పటికీ ఆయన అభిమానులకు నమ్మశక్యంగా లేదు. కన్నడ నాట ఓ వెలుగు వెలిగిన పునీత్ మరణం ఆయన అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. పునీత్ మరణాన్ని తట్టుకోలేక కొంతమంది ఫ్యాన్స్ ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. పునీత్ మరణించి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆయన పేరు జనం నోళ్లలో నానుతూనే ఉంది. మరోవైపు, పునీత్ మరణించారనే విషయం ఇప్పటికీ ఆయన మేనత్తకు తెలియదట.

పునీత్ అంటే ఆయన మేనత్త నాగమ్మ (90)కు అమితమైన ప్రేమ. పునీత్ తండ్రి డా.రాజ్‌కుమార్‌కు నాగమ్మ సొంత చెల్లెలు. చిన్నతనంలో రాజ్‌కుమార్ పిల్లలను నాగమ్మ చూసుకునేవారు. అందరు మేనల్లుళ్లలో ఆమెకు పునీత్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది. పెద్దయ్యాక పునీత్ కూడా తరచూ గజనూర్‌లోని మేనత్త ఇంటికి వెళ్లి వచ్చేవాడు. మేనత్త నాగమ్మ, పునీత్ మధ్య ఎంతటి అనుబంధం ఉందో కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అందుకే పునీత్ చనిపోయినప్పుడు ఆ విషయాన్ని ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

పునీత్ మరణవార్తను ఆమె తట్టుకోలేదనే ఉద్దేశంతో ఇప్పటికీ ఆ విషయాన్ని ఆమెకు తెలియకుండానే ఉంచారు.'ఆమె ఎప్పుడు అప్పు గురించి అడిగినా... అతను వేరే దేశంలో ఔట్ డోర్ షూట్‌లో ఉన్నాడని చెబుతాం. అప్పు సినిమా ఏదైనా టీవీలో ప్లే చేస్తే ఆమె చూసి సంతోషిస్తుంది. ఇప్పటివరకూ ఇలాగే మేనేజ్ చేస్తూ వస్తున్నాం. కొన్నేళ్ల క్రితం రఘన్న (రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ పెద్దన్న) గుండెపోటుకు గురైనప్పుడు.. నాగమ్మ తట్టుకోలేకపోయారు. ఆ షాక్‌తో ఆమె ఆసుపత్రిలో చేరారు. తన సోదరుడి పిల్లలను ఆమె తన సొంత పిల్లల్లా చూసుకునేవారు. వారికి ఏమైనా జరిగితే ఆమె తట్టుకోలేరు. అందుకే ఇప్పటికీ అప్పు లేడనే విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నాం.' అని పునీత్ కుటుంబ సభ్యుల్లో ఒకరు వెల్లడించారు.

గజనూర్‌లో పునీత్ మేనత్త ఉంటున్న ఇంట్లో ఇప్పటికీ పునీత్ చిత్రపటానికి పూల దండ వేయలేదు. చుట్టుపక్కలవారు లేదా గ్రామస్తులు ఎవరైనా ఇంటికి వస్తే.. పునీత్ మరణించారనే విషయాన్ని ఇంట్లో ప్రస్తావించకుండా ముందే వారికి తగిన సూచనలు చేస్తారు. ఇటీవలే మేనత్త వద్దకు వెళ్లిన పునీత్ సోదరుడు రాజ్‌కుమార్.. ఎప్పటిలాగే ఆమెను కలిసొచ్చాడు. పునీత్ లేడనే విషయాన్ని మేనత్త వద్ద ఇప్పటికీ గోప్యంగా ఉంచుతున్నారు. 

Also Read: Allu Arjun- Rajamouli: బన్నీతో రాజమౌళి మూవీ.. సినీ వర్గాల్లో హాట్​ టాపిక్​

Also read: Ananya Pandey Photos: సన్ సెట్ లో సముద్రపు ఒడ్డున రౌడీ హీరోయిన్ హల్ చల్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News