Pushpa 2 Updates: పుష్ప 2 డిజిటల్ రైట్స్ కు రికార్డు స్థాయి ధర.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే?

Pushpa 2 Movie: మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్’ ఒకటి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2023, 06:43 PM IST
Pushpa 2 Updates: పుష్ప 2 డిజిటల్ రైట్స్ కు రికార్డు స్థాయి ధర.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే?

Pushpa 2 OTT Rights: మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2: ది రూల్’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప మూవీకి సీక్వెల్ గా ఇది రాబోతుంది. పుష్ప 2  షూటింగ్ వచ్చే ఏడాది జనవరికి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్నా, విలన్‍గా ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పార్ట్ 1 అంతా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగితే.. రెండో భాగం మెుత్తం పుష్ప రూల్ చేయడం చూపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

పుష్ప 2 మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.  పుష్ప 2: ది రూల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక తమ ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేసుకునేందుకు నెట్‍ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. ఎంత మెుత్తమనేది మేకర్స్ రివీల్ చేయలేదు. పుష్ప పార్ట్ 01తో అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఇతడి మేనరిజాన్ని చాలా మంది సెలెబ్రిటీలు, క్రికెటర్లు అనుకరిస్తూ వీడియోలు చేశారు. దీంతో పుష్ప 2: ది రూల్ సినిమాపై ఫుల్ బజ్ నెలకొని ఉంది.

Also Read: Prabhas-Sreeleela: ప్రభాస్ నెక్ట్స్ సినిమాలో శ్రీలీల.. స్టోరీ ఇదే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News