Jailer Movie Total Collections: రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్-ఎంటర్‌టైనర్ మూవీ జైలర్ నేటి శుక్రవారంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్క్ దాటతోబోంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న ముందస్తు అంచనాల ప్రకారం జైలర్ మూవీ ఆగస్టు 24 అన్ని భాషలు కలిపి రూ. 3 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ మొత్తం రూ. 298.75 కోట్లకు చేరుకున్నట్టయింది. జైలర్ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 582.65 కోట్లు మార్క్ రీచ్ అయింది.
కోలీవుడ్ ఫిలిం కాలమిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విటర్ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. జైలర్ మూవీ మొదటి వారంలో 450.80 కోట్లు రాగా, 2వ వారంలో 124.18 కోట్లు రాబట్టింది. కేవలం 15 రోజుల్లోనే రూ. 575 గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసిందని బాక్సాఫీస్ గణాంకాలను వివరించాడు.
మొదటి వ వారం - రూ. 450.80 కోట్లు
రెండవ వారం - రూ. 124.18 కోట్లు
మూడవ వారం - రూ. 7.67 కోట్లు
మొత్తం - రూ. 582.65 కోట్లు
మనోబాల చెబుతున్న బాక్సాఫీస్ వివరాల ప్రకారం జైలర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 600 కోట్ల మార్కుని తాకేందుకు దగ్గర్లోనే ఉంది. 2.0 మూవీ తర్వాత మళ్లీ ఈ మార్క్ తాకిన రెండో సినిమాగా జైలర్ మూవీ నిలిచింది. 2.0 మూవీ ఈ రికార్డ్ సొంతం చేసుకోవడానికి కేవలం 9 రోజుల సమయమే పట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ మూవీ 48 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఇప్పటి వరకు అత్యధిక సింగిల్ డే కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. తమిళంలో ఒరిజినల్ వెర్షన్ గా వచ్చిన ఈ సినిమా హిందీ, కన్నడ, తెలుగులోకి డబ్ అయింది. ఆగష్టు 10న రిలీజైన జైలర్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద 'OMG 2', 'గదర్ 2: ఏక్ కథ వంటి సినిమాలతో పోటీపడి మరీ ఈ కలెక్షన్స్ రాబట్టడం మరో విశేషం.
#Jailer WW Box Office
CROSSES ₹5⃣7⃣5⃣ cr gross mark in just 15 days.
Second FASTEST to achieve this feat after #2Point0 which took just 9 days.
||#Rajinikanth | #ShivaRajKumar | #Mohanlal||
ENTERS 3rd week on a positive note.
Week 1 - ₹ 450.80 cr
Week 2 - ₹ 124.18 cr
Week… pic.twitter.com/Sa4ozpqLty— Manobala Vijayabalan (@ManobalaV) August 25, 2023
ఇది కూడా చదవండి : Pushpa 2 Release Date: పుష్ప 2 సినిమా విడుదల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే
జైలర్ మూవీలో రజినీకాంత్ రిటైర్డ్ జైలర్ పాత్రలో నటించారు. ఒక గ్యాంగ్ తమ నాయకుడిని జైలు నుండి విడిపించడానికి ప్రయత్నించే క్రమంలో ఏం జరిగింది అనేదే జైలర్ మూవీ స్టోరీ. వినాయకన్, రమ్యకృష్ణ, వసంత్ రవి, సునీల్, యోగిబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, నాగబాబు, మకరంద్ దేశ్‌పాండే ఇతర ప్రత్యేక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన జైలర్ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మొత్తానికి జైలర్ మూవీ కలెక్షన్స్ తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ స్టామినా ఏంటనేది మరోసారి చూపించాయి.
ఇది కూడా చదవండి : NTR Family To Visit Delhi: ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు.. తారకరత్న భార్య కూడా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి