Rakul Preet Singh Wedding: నిర్మాతని పెళ్లి చేసుకోబోతున్న రకుల్.. పెళ్లి డేట్ ఫిక్స్

Rakul Marriage: 2023 లో చాలామంది సెలబ్రిటీలు రంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా మ్యారేజ్‌‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు తన పెళ్లి ఎప్పుడు అనే విషయం ఒకసారి చూద్దాం

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 12:53 PM IST
Rakul Preet Singh Wedding: నిర్మాతని పెళ్లి చేసుకోబోతున్న రకుల్.. పెళ్లి డేట్ ఫిక్స్

Rakul Destination Wedding: ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ అనే డైలాగ్ తో మనందరిని మెప్పించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రకుల్ చాలా సంవత్సరాల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే సడన్ గా తనకు హిందీ చాన్సులు రావడంతో తెలుగు చిత్ర అవకాశాలను పక్కన పెట్టేస్తూ వచ్చింది రకుల్.

బాలీవుడ్ లో మాత్రం అనుకున్న స్థాయిలో రకుల్ మెప్పించలేకపోయింది. మరోపక్క తెలుగులో కూడా రకుల్ కి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కొద్ది రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీత  ప్రేమలో పడ్డానని, అతన్ని ప్రేమిస్తున్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించింది రకుల్ ప్రీత్. ఇక అప్పటి నుంచి రకుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ రకుల్ ఇప్పుడే పెళ్లి చేసుకోము అని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ ప్రేమ పక్షులు ఒక్కటి అవ్వబోతున్నారు అని తమ పెళ్ళికి అంతా సిద్ధమైపోయిందని తెలుస్తోంది.

బాలీవుడ్ మీడియా లో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మీరు పెళ్లి డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫైనల్ గా ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

మరో విశేషం ఏమిటి అంటే మీరిద్దరూ గోవా వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు, కేవలం ఫ్యామిలీ, పలువురు సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుకలు చేసుకొని ముంబైలో గ్రాండ్ బాలీవుడ్ రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చెయ్యనున్నట్లు సమాచారం. కాగా వీరి పెళ్లి వివరాలపై ఇంకా రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ.. ఇద్దరూ స్పందించలేదు. 

ఇక రకుల్ విషయానికి వస్తే..దిల్లీకి చెందిన ఈ బ్యూటీ.. 2009లో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అనే మూవీ చెయ్యడం ద్వారా ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. ఇక అక్కడి నుంచే ఆమె సినీ కెరియర్ పీక్స్ కి వెళ్లడం మొదలుపెట్టింది. 

Also read: PPF Benefits: నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి 26 లక్షలు పొందే అద్భుత పధకం

Also read: Ap New Pension Scheme: సంక్షేమ పథకాలతో ఎన్నికల ఏడాది ప్రారంభం, ఇవాళ్టి నుంచి 3 వేల పెన్షన్, కొత్త రేషన్ కార్డులు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News