Kantara Special Show in UNO రిషభ్ శెట్టి నటించి, తెరకెక్కించిన కాంతారా సినిమా దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఈ దశాబ్దానికి ఇంత కంటే లాభాలు తెచ్చి పెట్టే సినిమా మరొకటి వస్తుందో లేదో చెప్పలేం. పదిహేను కోట్లతో తెరకెక్కిస్తే నాలుగు వందల కోట్లకు పైగా వసూల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంతారా దెబ్బకు సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిసింది. కన్నడ పరిశ్రను మరోసారి ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేసింది కాంతారా.
కాంతారా సినిమాను ఆస్కార్ ఎంట్రీ కోసం కూడా పంపించారు. కానీ ఆస్కార్ రేసులో కాంతారా నిలబడలేదు. ఆర్ఆర్ఆర్ యూనిట్ మాదిరిగా కాంతారాను ప్రమోట్ చేయలేదు. అలా ప్రమోట్ చేయాలని అనుకోలేదేమో బహుషా. కాంతారాను ప్రమోట్ చేయాలనే ఉద్దేశం ఉంటే హోంబలే సంస్థ వెనక్కి తగ్గేది కాదు. కానీ ప్రచార ఆర్భాటాలేమీ వద్దని అనుకుందేమో. అయితే కాంతారా సైలెంట్‌గా ఇప్పుడు తన సత్తాను చాటుకుంది.
ఐరాస కార్యాయలంలోని పదమూడో నెంబర్ హాల్‌లోని బాలెక్సర్ట్ థియేటర్‌లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలో భూత కోల సంప్రదాయం మాత్రమే కాకుండా.. అటవీ పరిరక్షణ, అంతరించిపోతోన్న జాతుల సంరక్షణ, అడవి మనుషుల జీవన విధానం మీద అంతర్లీనంగా చిత్రీకరించిన సీన్లు కూడా ఉన్నాయి.
ఐరాసలో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చర్చించబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఆస్కార్ కంటే ఎంతో అరుదైన గుర్తింపు, గౌరవం అని సోషల్ మీడియాలో ఓ వర్గం అంటోంది. ఆస్కార్ కావాలంటే ఖర్చు పెడితే చాలు.. కానీ ఇలాంటి గౌరవాన్ని మాత్రం డబ్బుతో కొనలేమని ఓ వర్గం సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తోంది.
ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కోసం ఎనభై కోట్లు ఖర్చు పెట్టిందంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్లు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో తమ్మారెడ్డి పొగిడిన తీరు, మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. తెలుగు పాటకు ఆస్కార్ రావడం ఆనందంగా ఉందంటూ తమ్మారెడ్డి అన్నాడు.
Also Read: Keerthy Suresh Pics : కీర్తి సురేష్ కూడా చూపించేస్తోంది.. మత్తెక్కించే చూపుల్తో రచ్చ.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook