Indraja Jabardasth: సీనియర్‌ నటి ఇంద్రజ సంచలన నిర్ణయం.. జబర్దస్త్‌ను వీడుతూ కన్నీరుమున్నీరు

Indraja Tears Up After Breaks To Jabardasth Show: బుల్లితెరతో మరోసారి ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న సీనియర్‌ నటి ఇంద్రజ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు మళ్లీ ప్రేక్షకుల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించి ఆమె కన్నీరు పెట్టేసుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 27, 2024, 08:44 PM IST
Indraja Jabardasth: సీనియర్‌ నటి ఇంద్రజ సంచలన నిర్ణయం.. జబర్దస్త్‌ను వీడుతూ కన్నీరుమున్నీరు

Actress Indraja Tears: నాడు సినిమాలతో నాటి తరాన్ని ఆకట్టుకున్న అప్పటి హీరోయిన్‌ ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై కనిపిస్తూ మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. ఓ టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న షోలకు జడ్జిగా హాజరై సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా పాటలు, డ్యాన్స్‌లు, పంచ్‌లతో ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న ఇంద్రజ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు టీవీ పరిశ్రమకు బ్రేక్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ చానల్‌ విడుదల చేసిన ప్రొమో ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. షోను వీడుతుండడంపై ఆమె కన్నీళ్లు పెట్టేసుకోవడంతో ఆ షో స్టేజిపై భావోద్వేగ వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా ఆ చానల్‌ విడుదల చేసిన ప్రొమో ఆకట్టుకుంటోంది.

Also Read: Kavya Maran Crying: గుండెల్ని పిండేసే సన్నివేశం.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప

మల్లెమాల, జబర్దస్త్‌ యూట్యూబ్‌ చానళ్లు తాజాగా జబర్దస్త్‌ షో ప్రొమోను విడుదల చేశారు. మే ౩0వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో నవ్వులు పూయిస్తోంది. రాకెట్‌ రాఘవ, సద్దాం, కెవ్వు కార్తీక్‌, నూకరాజులకు సంబంధించిన స్కిట్లు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. రాఘవ బిచ్చగాళ్ల నేపథ్యంలో.. కెవ్వు కార్తీక్‌ లేడి గెటప్‌లో, సద్దామ్‌ అదే పాత పద్ధతిలో పంచ్‌లు వేస్తూ తమ స్కిట్లు రూపొందించుకున్నట్లు ప్రొమో చూస్తే తెలుస్తోంది. ఇక నూకరాజు మరోసారి జడ్జి స్థానంలో కూర్చున్న ఇంద్రజను పొగుడుతూ స్కిట్‌ చేశాడు. సిరి హన్మంత్‌, సీనియర్‌ హాస్య నటుడు కృష్ణ భగవాన్‌ ప్రత్యేకంగా కనిపించారు.

Also Read: Hardik Pandya Divorce: క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా విడాకుల వార్తలు.. భార్య నటాషా స్పందన ఇదే!

అయితే ప్రొమో ఆఖరిలో ప్రత్యేకత కనిపించింది. జబర్దస్త్‌ షో నుంచి ఇంద్రజ వైదొలగనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 'ఒక చిన్న గ్యాప్‌ తీసుకుంటున్నా' అని ఆమె చెప్పారు. ఆమె మాట్లాడుతున్న సమయంలో నటీనటులంతా ఒకవిధమైన భావోద్వేగానికి లోనయ్యారు. ఇంద్రజ కన్నీళ్లు పెట్టేవరకు ఆ స్టేజ్‌ మొత్తం ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది.

పాత తరం సినిమాలతో సందడి చేసిన ఇంద్రజను నేటి తరానికి కూడా దగ్గర చేసింది ఈటీవీ జబర్దస్త్‌ షో. దాదాపు రెండేండ్ల కింద జబర్దస్త్‌ షోకు ఆమె జడ్జిగా వచ్చారు. ఒకసారి షోకు అతిథిగా వచ్చిన ఆమె అనంతరం ఆ టీవీ చానల్‌లో ప్రసారం చేసే అన్ని వినోద కార్యక్రమాలకు ఇంద్రజ జడ్జిగా వస్తున్నారు. పంచ్‌లు, నవ్వులు, డ్యాన్స్‌లతో ఆకట్టుకుంటున్న ఇంద్రజ చాలా రోజుల తర్వాత జబర్దస్త్‌ షోకు బ్రేక్‌ ఇచ్చారు. ఈ షోకు బ్రేక్‌ ఇవ్వడంతో తన స్వస్థలం చెన్నైకి వెళ్లిపోయారు. అయితే దాదాపు రెండు మూడు నెలల తర్వాత మళ్లీ వస్తారని తెలుస్తోంది. మరి ఆమె లేని స్థానంలో ఎవరూ వస్తారనేది ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News