Bigg Boss Telugu 5: చివరి దశకు బిగ్ బాస్...షణ్ముఖ్ జర్నీ అదుర్స్...

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ నిర్వాహకులు మంగళవారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో షణ్ముఖ్ జర్నీని చూపించినట్లు తెలుస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 04:02 PM IST
Bigg Boss Telugu 5: చివరి దశకు బిగ్ బాస్...షణ్ముఖ్ జర్నీ అదుర్స్...

Bigg Boss Telugu 5:  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5(Bigg Boss Telugu 5) చివరి దశకు చేరుకుంది. విన్నర్ ఎవరనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. టాప్-5 కంటెస్టెంట్స్ ఖరారు అయిపోయారు.  ఈ నేపథ్యంలో ఇంటి సభ్యులైన శ్రీరామ్, సన్నీ, మానస్, షణ్ముఖ్, సిరిలకు బిగ్ బాస్ మధురజ్ఞాపకాలను అందించాడు. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో తమ జర్నీ ఎలా సాగిందో గుర్తుచేశాడు. 

Also Read: BiggBoss 5 Telugu Grand Finale:బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే అతిధులు ఎవరో తెలుసా

సోమవారం శ్రీరామ్, మానస్ ల ప్రయాణాన్ని చూపించిన బిగ్ బాస్(Bigg Boss) ...ఇవాళ షణ్ముఖ్ జర్నీ చూపించినట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో షణ్ముక్(Shanmukh) హౌస్ మేట్స్ తో గడిపిన ఫోటోలను చూపించినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాల్ని చూసి...షణ్ముఖ్ ఎంతో మురిసిపోయాడు. ‘''ఎంత మంది మిమ్మల్ని నామినేట్‌ చేసినా అధైర్య పడకుండా ఆటను ఫినాలే వరకూ తీసుకొచ్చారు’''అని ‘బిగ్‌బాస్‌’ షణ్ముఖ్‌కి కితాబివ్వడంతో..అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

బిగ్ బాస్  గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 19న జరుగనుంది. ఈ ఫినాలేను ముఖ్య అతిధులుగా టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి కీలక నటులు హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ అగ్రనటుడు రణ్‌వీర్ సింగ్, అగ్ర నటీమణులు దీపికా పదుకోన్(Dipika Padukone), అలియా భట్‌లు(Alia Bhatt) గ్రాండ్ ఫినాలే అతిధులుగా రానున్నట్టు సమాచారం. మరోవైపు రామ్‌చరణ్‌తో(Ramcharan)పాటు ఆర్ఆర్ఆర్ టీమ్(RRR Team)కూడా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x