Upcoming Telugu Movies: ఈ వారం ఓటీటీలో థియేటర్‌లలో రిలీజ్‌ అయ్యే సినిమాలు ఇవే

Upcoming Movies in this week:ఈ మధ్య వరుసగా మూవీస్ చిత్రాలు తెలుగుతెరపై సందడి చేస్తున్నాయి. కొన్ని మూవీలు థియేటర్‌లలో డైరెక్ట్‌గా రిలీజ్‌ కానున్నాయి. మరికొన్ని ఓటీటీలో విడుదల అవ్వనున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2021, 06:05 PM IST
  • సెప్టెంబరు 17న థియేటర్ల రిలీజ్‌ కానున్న పలు సినిమాలు,
    స్రీమింగ్‌ కానున్న మూవీస్‌
  • హాట్‌స్టార్‌లో నితిన్‌ మ్యాస్ట్రో
  • ఆహాలో ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ
Upcoming Telugu Movies: ఈ వారం ఓటీటీలో థియేటర్‌లలో రిలీజ్‌ అయ్యే సినిమాలు ఇవే

Upcoming Telugu Movies in OTT and theaters: చాలా రోజులుగా కరోనా పరిస్థితుల వల్ల  తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులకు గురైంది. సినిమాలు కూడా సరిగ్గా రిలీజ్ కాలేదు. కానీ ఈ మధ్య వరుసగా మూవీస్ చిత్రాలు తెలుగుతెరపై సందడి చేస్తున్నాయి. కొన్ని మూవీలు థియేటర్‌లలో డైరెక్ట్‌గా రిలీజ్‌ కానున్నాయి. మరికొన్ని ఓటీటీలో విడుదల అవ్వనున్నాయి. మరి ఈ వారం మన ముందుకు రాబోతున్న ఆ మూవీస్‌పై ఓ లుక్కేద్దామా.

నితిన్‌ మ్యాస్ట్రో

నితిన్‌, (Nithin) నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన మూవీ మ్యాస్ట్రో (maestro). తమన్నా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌లో కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 17 నుంచి స్రీమింగ్‌ కానుంది. అంధుడిగా నితిన్‌ నటన ఇందులో మెప్పించనుంది. ఈ మూవీ హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ (andhadhun) రీమేక్‌. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

 

విజయ్‌సేతుపతి.. అనబెల్‌.. సేతుపతి

విజయ్‌ సేతుపతి (vijay sethupathi) కీలక పాత్రలో నటించిన రెండు చిత్రాలు లాభం, తుగ్లక్‌ దర్బార్‌ ఈ నెలలోనే ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం రానుంది. తాప్సీతో కలిసి విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం అనబెల్‌.. సేతుపతి. దీపక్‌ సుందర్‌రాజన్‌ దర్శకుడు. ఈ మూవీ డిస్నీ+హాట్‌స్టార్‌ (hotstar) వేదికగా సెప్టెంబరు 17న స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహాలో ఇచ్చట వాహనములు నిలుపరాదు స్ట్రీమింగ్‌

సుశాంత్‌ కథానాయకుడిగా ఎస్‌.దర్శన్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ డ్రామా థ్రిల్లర్‌ ఇచ్చట వాహనములు నిలుపరాదు (ichata vahanamulu niluparadu). మీనాక్షి చౌదరి కథానాయిక. ఇటీవల రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ఆహా’వేదికగా సెప్టెంబరు 17వ తేదీ నుంచి ఇచ్చట వాహనములు నిలుపరాదు స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read : Allu Arjun Simplicity:రోడ్డు పక్కన హోటల్‌లో టిఫిన్ చేసిన అల్లుఅర్జున్.. వీడియో వైరల్

సందీప్‌కిషన్‌..గల్లీ రౌడీ

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ మూవీ గల్లీ రౌడీ (gully rowdy) సెప్టెంబరు 17న థియేటర్‌లలో సందడి చేయనుంది. ఇందులో నేహాశెట్టి హీరోయిన్. ఈ మూవీ ట్రైలర్‌ను మెగస్టార్‌‌ చిరంజీవి రిలీజ్‌ చేశారు. ఇందులో సందీప్‌ కిషన్‌ విశాఖ గల్లీరౌడీగా కనిపించనున్నారు. సందీప్‌ కామెడీ టైమింగ్‌ బాగుండనుంది. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ ఈ మూవీని నిర్మించాయి.

హర్భజన్‌.. అర్జున్‌ల మూవీ

క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, (harbhajan singh) నటుడు అర్జున్‌ (arjun) కథానాయకులుగా నటించిన చిత్రం ఫ్రెండ్‌షిప్. జాన్‌పాల్‌ రాజ్‌, శ్యామ్‌ సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహిళలను ఎలా గౌరవించాలనే అంశం ఆధారంగా రూపొందిన ఈ ఫ్రెండ్‌షిప్‌ మూవీకి నిర్మాత ఎ.ఎన్‌.బాలాజీ. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ రానుంది.

విజయ్‌ ఆంటోనీ.. విజయ రాఘవన్‌

విజయ్‌ ఆంటోని (vijay antony) తమిళంలో నటించే ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ ఉంటుంది. ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని హీరోగా తెరకెక్కిన విజయ రాఘవన్‌ మూవీ కూడా సెప్టెంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. విజయ్‌ ఈ సినిమాలో ట్యూషన్‌ మాస్టర్‌గా కనిపించనున్నారు.

ప్లాన్‌‌‌ బి

శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పాత్రధారిగా కె.వి.రాజమహి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్లాన్‌ బి (plan b movie). ఎ.వి.ఆర్‌ నిర్మాత. సూర్య వశిష్ఠ, మురళీశర్మ, రవిప్రకాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ కూడా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Bigg Boss 5 Telugu: గట్టిగా ఇచ్చిపారేసిన శ్వేతావర్మ! ప్రోమో వైరల్..

డోంట్‌ బ్రీత్‌2

స్టీఫెన్‌ లాంగ్‌ కీలక పాత్రలో సయేగస్‌ దర్శకత్వం వహించిన అమెరికన్‌ హారర్‌ థ్రిల్లర్‌ డోంట్‌ బ్రీత్‌2(don't breathe 2). గతంలో అమెరికాలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కూడా సెప్టెంబరు 17 థియేటర్‌లలో విడుదల కానుంది.

హనీట్రాప్‌

సొంతవూరు, గల్ఫ్‌.. లాంటి సందేశాత్మక మూవీలతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న డైరెక్టర్ పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి తెరకెక్కించిన కొత్త మూవీ హనీ ట్రాప్‌. వివి వామనరావు కీలక పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించారు ఈ మూవీని. రిషి, శిల్ప నాయక్‌, తేజు అనుపోజు, శివ కార్తీక్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ఈ వారంలో థియేటర్స్‌లో.. ఓటీటీ (OTT) వేదికగా చాలా మూవీస్ రానున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x