"దిల్ వాలే"ని వేధిస్తున్న "ఫోన్ కాలర్"

   

Last Updated : Nov 9, 2017, 06:19 PM IST
"దిల్ వాలే"ని వేధిస్తున్న "ఫోన్ కాలర్"

దిల్ వాలే, బద్రినాథ్ కీ దుల్హనియా, జుడువా 2 లాంటి చిత్రాలతో బాగా పాఫులరైన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ముంబయిలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషనులో ఓ ఆగంతకురాలిపై ఫిర్యాదును దాఖలు చేశారు. గత కొంతకాలంగా ఓ యువతి తనను వేధిస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం ముంబయికి చెందిన ఓ యువతి వరుణ్ ఫోన్ నెంబరు ఎలాగోలా సంపాదించి రోజూ మెసేజ్‌లు పంపడం ప్రారంభించింది. అయితే అలా మెసేజ్‌లు చేయవద్దని వరుణ్ ఆమెను కోరినా తను వినలేదు. ఇక చేసేదేమీ లేక అతను ఆమె నెంబరును బ్లాక్ చేశాడు. కానీ.. ఇటీవలి కాలంలో వరుణ్‌కి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి... ఆ అమ్మాయి పంపే సందేశాలకు సమాధానం ఇవ్వకపోతే ఆమె ఆత్మహత్య చేసుకొనే అవకాశం ఉందని... ఆ చావుకి వరుణే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పడంతో.. సదరు సినీహీరో ఇప్పుడు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. ముంబయి సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన పోలీసులు ప్రస్తుతం ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారు. వరుణ్ అందించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా కాల్ ఎక్కడ నుండి వచ్చిందో, ఎవరు చేశారో అన్నది తాము ట్రాక్ చేస్తామని వాళ్లు తెలిపారు. 

Trending News