Varun Tej-Lavanya Tripathi wedding: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు త్వరలో వివాహ బంధంతో ఒక్కటికానున్న సంగతి తెలిసిందే. ఈ నెల చివరలో వీరి పెళ్లి జరగబోతుందని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. మెగా ఇంట ఇప్పట్లో పెళ్లి వేడుక జరిగేలా కనిపించట్లేదు. ఈపాటికే అతిథులకు శుభలేఖలు పంచడం, బ్యాచిలర్ పార్టీలంటూ.. ఇలా ఏదో ఒక హడావుడి జరగాలి. కానీ అలాంటివి ఏవీ ఆ ఫ్యామిలీ కనిపించడం లేదు. దీంతో పెళ్లి వాయిదా పడుతుందోమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దీని వెనుక ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.
నాగబాబు కూతురు, వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో డైవర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్, లావణ్యల నిశ్చితార్థం జూన్ 09న జరిగింది. నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకకు చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌తోపాటు పలువురు మెగా కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. వీరి పెళ్లికి ఆగస్టు 24న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు.. వివాహం ఇంటలీ జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. వరుణ్ నిశ్చాతార్థం జరిగిన కొన్ని రోజులకే నిహారిక విడాకులు తీసుకోని డిఫ్రెషన్ లోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే కెరీర్ పై దృష్టి పెట్టి వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తుంది.
ఇంట్లో పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయాలని మెగా బ్రదర్ నాగబాబు భావిస్తునట్లు టాక్ వినిపిస్తోంది. అయితే వీరి పెళ్లి ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి చూడాలి. మరోవైపు వరుణ్ నటించిన 'గాండీవధారి అర్జున' రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షివైద్య హీరోయిన్ గా నటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి