Mechanic Rocky Movie Review: మెకానిక్ రాకీ మూవీ రివ్యూ.. హిట్టా..ఫట్టా.. ?

Mechanic Rocky Movie Review: విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 22, 2024, 02:34 PM IST
Mechanic Rocky Movie Review: మెకానిక్ రాకీ మూవీ రివ్యూ.. హిట్టా..ఫట్టా.. ?

రివ్యూ: మెకానిక్ రాకీ (Mechanic Rocky)

నటీనటులు:విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సీనియర్ నరేష్, సునీల్, హైపర్ ఆది, హర్ష చెముడు తదితరులు..

ఎడిటర్: అన్వర్ అలీ

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి

సంగీతం: జేక్స్ బిజోయ్

నిర్మాత : రామ్ తాళ్లూరి, రజినీ తాళ్లూరి

దర్శకత్వం: రవితేజ ముళ్ళపూడి

విశ్వక్ సేన్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ కా దాస్ అంటూ హీరోగా తన కంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ‘మెకానిక్ రాకీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా హిట్ ట్రాక్ అందుకున్నాడా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
రాకేష్ అలియాస్ మెకానిక్ రాకీ  హైదరాబాద్ లో  ఓ బిజియస్ట్ ప్రదేశంలో తన గ్యారేజ్ రన్ చేస్తుంటాడు. దానిపై రంకీ రెడ్డి (సునీల్ ) కన్ను పడుతుంది. దాన్ని ఖాళీ చేయమని వాళ్ల తండ్రి (నరేష్)ను బెదిరిస్తాడు. ఈ క్రమంలో రాకీ  తండ్రి చనిపోతాడు. తండ్రి ఆఖరి కోరిక మేరకు ఆ గ్యారేజ్ దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. అయితే.. వేరే వాళ్ల దగ్గర రూ. 25 లక్షలు తీసుకొని దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే.. తాను రూ. 50 లక్షలు ఇస్తాని రంకీ రెడ్డికి మాట ఇస్తాడు. ఈ క్రమంలో అతను రూ. 50 లక్షలు రంకీ రెడ్డికి ఇచ్చి తన గ్యారేజ్ దక్కించుకున్నాడా ? మరోవైపు తన ప్రియురాలు ప్రియ (మీనాక్షి చౌదరి) ఓ ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ ప్రియాకు వచ్చిన సమస్య ఏమిటి.. ? దానికి హీరో గ్యారేజ్ కు ఉన్న సంబంధం ఏమిటి.. ? మధ్యలో ఇన్సూరెన్స్ ఏజెంట్ మాయా ఎవరు.. ?  ఆమె రాక వల్ల వీళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయనేది తెలియాలంటే ‘మెకానిక రాకీ’ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు రవితేజ ముళ్లపూడి తన తొలి చిత్రాన్నే కొత్త పాయింట్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా జరుగుతున్న ఆన్ లైన్ మోసాలను ఈ సినిమాలో ప్రస్తావించారు. ఈ మోసాల వల్ల వ్యక్తుల జీవితాలు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆర్ధికంగా మోసపోయామని తెలియడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాన్ని ‘మెకానికి రాకీ’ సినిమాలో ప్రస్తావించారు. ఫస్టాఫ్ వరకు సినిమా కథ ఎటుపోతుందో తెలియదు. హీరో, శ్రద్ధా శ్రీనాథ్ కు తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం.. ఆపై హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్, కొన్ని కామెడీ సీన్స్ తో అలా కానేచ్చేసాడు. హీరోయిన్  కానీ ఇంటర్వెల్ తర్వాత అసలు పాయింట్ లోకి వచ్చాడు దర్శకుడు. ఈ ఆన్ లైన్ మోసం ఏమిటి..? దాని కహాని చెప్పేస్తే.. చూసే ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఉండదు. ఈ సినిమా చూస్తుంటే.. విశాల్ ‘అభిమన్యుడు’ గుర్తుకు వస్తుంది.మధ్యలో ఫైట్స్ తో మాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసాడు.  మొత్తంగా మన సమాజంలో ఎక్కువగా జరుగుతున్న ఆన్ లైన్ మోసగాళ్ల గుట్టును హీరో ఎలా రట్టు చేసాడు. అందుకు ఎలాంటి ఎత్తులు వేసాడు. చివరకు విలన్ గ్యాంగ్ ను ఎలా చిత్తు చేసాడనేది ఇంకాస్త క్రిస్పీగా తెరకెక్కించి ఈ సినిమా మరో లెవల్లో ఉండేది. ఉన్నంతో మాస్ ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు.
సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు పర్వాలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేసాడు. సినిమాకు సెకండాఫ్ లో ఇచ్చిన ఆర్ఆర్ ఈ సినిమాను మరో లెవల్లో కూర్చోబెట్టాడు.

నటీనటుల విషయానికొస్తే..

విశ్వక్ సేన్ తన నటనతో మెప్పించాడు. మెకానిక్ రాకీగా ఎంతో ఈజ్ చూపించాడు. మొత్తంగా తన యాక్టింగ్, ఫైటింగ్స్, ఎమోషనల్ సీన్స్ లలో మెప్పించాడు.  హీరో విశ్వక్ సేన్ తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ తన యాక్టింగ్ తో మెప్పించింది. ఇప్పటి వరకు మనం చూడని మరో యాంగిల్ ను దర్శకుడు చూపెట్టాడు. మీనాక్షి చౌదరి తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించాడు. సీనియర్ నరేష్ మరోసారి తన యాక్టింగ్ తో కట్టిపడేసాడు. సునీల్ ఉన్నంతలో తన విలనిజం ప్రదర్శించాడు. అమృతం హర్షవర్ధన్ పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

సెకాండాఫ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్

సినిమా నిడివి

అక్కడక్కడ లాజిక్ లేని సీన్స్

పంచ్ లైన్.. ఓ మోస్తారుగా మెప్పించే ‘మెకానిక్ రాకీ’

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News