Venkatesh 75 : వెంకీమామతో శైలేష్ కొలను.. హిట్ యూనివర్సల్‌లో భాగమేనా?

Venkatesh 75 Movie విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన సినిమాగా నిలిచే 75వ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఈ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. అసలే ఇప్పుడు వెంకీ మామ ఫుల్ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2023, 01:38 PM IST
  • వెంకీమామ కొత్త సినిమా అప్డేట్
  • 75వ సినిమా అప్డేట్‌ ఇచ్చిన యూనిట్
  • శైలేష్ కొలనుతో వెంకీమామ సినిమా
Venkatesh 75 : వెంకీమామతో శైలేష్ కొలను.. హిట్ యూనివర్సల్‌లో భాగమేనా?

Venkatesh 75 Movie హిట్ సినిమాలతో శైలేష్ కొలనుకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు బాగానే హిట్ అయ్యాయి. హిట్ యూనివర్సిటీకి సంబంధించిన సినిమాలే చేస్తాను అని శైలేష్ ఇది వరకు చెప్పాడు. అయితే ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌తో కలిసి సినిమాను అనౌన్స్ చేశాడు. వెంకీమామ కెరీర్‌లో 75వ సినిమాగా రాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఇప్పుడు వచ్చింది. నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను గ్రాండ్‌గా నిర్మించి సక్సెస్ కొట్టిన నిర్మాత వెంకట బోయనపల్లి ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ మీద నిర్మిస్తున్నాడు.

వెంకటేష్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా ఓరి దేవుడా అనే సినిమాలో కనిపించాడు. వెంకీ మామ స్పెషల్ రోల్‌ చేసిన ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది. అంతకు ముందు ఎఫ్ 3 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా పరమ నాసిరకంగా ఉన్నా కూడా కలెక్షన్లు వచ్చాయి. వంద కోట్ల గ్రాస్ దాటిందంటూ నిర్మాతలు ప్రకటించుకున్నారు. అలా మొత్తానికి వెంకీ మామ సినిమాలు మాత్రం థియేటర్లో, ఓటీటీల్లో బాగానే ఆడేస్తున్నాయి.

కరోనా సమయంలో అయితే దృశ్యం 2, నారప్ప సినిమాలతో వెంకీ మామ మ్యాజిక్ చేశారు. అవి రెండూ రీమేక్‌లే అయినా కూడా వెంకటేష్ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు మళ్లీ ఓ ప్రయోగం చేసేందుకు వెంకీ మామ సిద్దమయ్యాడు. న్యూ అడ్వెంచర్ అని చెబుతూ శేలైష్ కొలనుతో చేయబోతోన్న సినిమాకు సంబంధించిన ప్రీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జనవరి 25న సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తారట.

శైలేష్‌ కొలను అయితే హిట్ ఫస్ట్ కేస్, హిట్ సెకండ్ కేస్‌ అంటూ హిట్లు కొట్టేస్తున్నాడు. విశ్వక్ సేన్‌తో తీసిన మొదటి పార్ట్, అడివి శేష్‌తో తీసిన రెండో పార్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. మూడో పార్టును నానితో ప్లాన్ చేశాడు. మరి ఈ వెంకీమామతో చేయబోతోన్న సినిమా హిట్ యూనివర్సిటీలో భాగంగా ఉంటుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News