Virata Parvam Twitter Review: తెలుగులో ఇదివరకు నక్సల్స్ సినిమాలు చాలానే వచ్చాయి. నక్సల్ సినిమా అనగానే విప్లవ భావజాలాన్ని ప్రమోట్ చేసే సినిమాలనే అభిప్రాయం కొంతవరకు స్థిరపడిపోయింది.అందుకే విరాటపర్వం సినిమా వస్తోందంటే.. ఈరోజుల్లో విప్లవ భావజాలాన్ని చూస్తారా అన్న ప్రశ్నలు వినిపించాయి. కానీ ఇది విప్లవ భావజాలాన్ని ప్రమోట్ చేసే మూవీ కాదని.. ఆ నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని దర్శకుడు వేణు ఊడుగుల స్పష్టతనిచ్చారు. ఒక అర్థవంతమైన సినిమా తీశామని.. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడికి ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని చెప్పారు. మరి వేణు ఊడుగుల చెప్పినట్లే ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చిందా.. ఇవాళ విరాటపర్వం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన వేళ ట్విట్టర్‌లో నెటిజన్ల రివ్యూలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
#VirataParvam is honest attempt by @venuudugulafilm.Poetic writing & execution.Truly remarkable. 👏
Must appreciate @RanaDaggubati for doing Ravanna.Perfect.👍 Take a bow @Sai_Pallavi92. What an actor she is.!Another feather in the cap.👌Visuals & BGM are assets. Must watch.✊— Suresh Kondi (@SureshKondi_) June 16, 2022
'వేణు ఊడుగుల నిజాయితీగా తెరకెక్కించిన చిత్రం విరాటపర్వం. కవితాత్మకంగా సాగే రచన, సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రవన్న పాత్ర చేసినందుకు కచ్చితంగా రానా దగ్గుబాటిని అభినందించాలి. సాయి పల్లవి నటన అద్భుతంగా ఉంది. బీజీఎం, విజువల్స్ బాగున్నాయి. తప్పకుండా చూడాల్సిన సినిమా..' అంటూ సినిమాపై ఓ నెటిజన్ ఇలా తన రివ్యూ ఇచ్చాడు.
#VirataParvam
My rating 3.5/5
Ultimate story, goosebump action sequences#SaiPallavi & #ranadaggubati acting is good
Superb climax, rest is feelgood
BGM is not upto the mark#VirataParvamreview #venkateshdaggubati— Lokesh Nara (@Jaitdpofficeal) June 17, 2022
'విరాటపర్వం సినిమాకు నా రేటింగ్ 3.5/5. కథ అద్భుతంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలకు గూస్ బంప్స్ ఖాయం. సాయిపల్లవి, రానా దగ్గుబాటి నటన చాలా బాగుంది. క్లైమాక్స్ సూపర్బ్. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. బీజీఎం అనుకున్నంత స్థాయిలో లేదు..' లేదు అని మరో నెటిజన్ ఇలా తన రివ్యూ ఇచ్చాడు.
#VirataParvam Review:
A Decent First Half 👍#RanaDaggubati shines 👌#SaiPallavi As Usual, Fire 🔥
Direction, Cinematography, BGM & Screenplay Is Looking Good So Far 😇
Second Half is the Key 🙂#VirataParvamReview pic.twitter.com/3MKJnLr8AN
— Kumar Swayam (@SwayamD71945083) June 16, 2022
'ఫస్టాఫ్ బాగుంది.. రానా దగ్గుబాటి తన నటనతో మెప్పించాడు. సాయి పల్లవి ఎప్పటిలాగే అద్భుతంగా చేసింది. డైరెక్షన్, సినిమాటోగ్రాఫీ, బీజీఎం, స్క్రీన్ ప్లే అన్నీ బాగా కుదిరాయి. సినిమాకు సెకండాఫ్ చాలా కీలకం.' అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.
#VirataParvam A Realistic Drama that has a few good moments but does not keep us engaged overall!
The director tries to tell the story in the realist way possible but the proceedings are not appealing.
Performances by Sai Pallavi and rest of cast is very good.
Rating: 2.5/5
— Venky Reviews (@venkyreviews) June 17, 2022
విరాటపర్వం ఒక రియలిస్టిక్ డ్రామా. ఇందులో కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే.. సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు రియలిస్టిక్‌గా కథ చెప్పేందుకు ప్రయత్నించాడు కానీ ఆ క్రమంలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.నటీనటుల పెర్ఫామెన్స్ చాలా బాగుంది. సినిమాకు నా రేటింగ్ 2.5/5 అంటూ మరో నెటిజన్ తన రివ్యూని షేర్ చేశాడు.
#VirataParvam is a very great attempt in TFI ❤️🫡 @RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm take a bow 🙏
Bit slow at some places, but the director has beautifully established the story arc, #Telangana nativity, highs/lows, great dilogs ✌️🫶🍻
AWARDS incoming 🤙💥— RT 🙋 (@RaajTharun) June 17, 2022
'టాలీవుడ్‌లో ఇదో గొప్ప ప్రయత్నం. సాయి పల్లవి, రానా దగ్గుబాటి, వేణు ఊడుగులకు శిరసు వంచి నమస్కారం. సినిమా అక్కడక్కడా కొంత నెమ్మదిగా సాగింది. కానీ దర్శకుడు వేణు ఊడుగుల కథను అందంగా ఎస్టాబ్లిష్ చేశాడు. తెలంగాణ నేటివిటీ, సంభాషణలు గొప్పగా ఉన్నాయి. అవార్డులు వచ్చేస్తున్నాయి.' అంటూ మరో నెటిజన్ ఇలా తన రివ్యూ ఇచ్చాడు.
Also Read: Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదేనా... సాయి పల్లవి పాత్ర నిజ జీవితంలో ఆమెదేనా..?
Also Read: Sai Pallavi: మరో వివాదంలో సినీ నటి సాయి పల్లవి..పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.