Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదేనా... సాయి పల్లవి పాత్ర నిజ జీవితంలో ఆమెదేనా..?

Virata Parvam Real Story : విరాటపర్వం సినిమా కథపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా యథార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ సినిమా ఎవరి కథ అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 02:06 PM IST
  • విరాటపర్వం సినిమా అప్‌డేట్స్
  • విరాటపర్వం సినిమా కథపై విస్తృతంగా చర్చ
  • సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్ర నిజ జీవితంలో ఎవరిదంటే...
Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదేనా...  సాయి పల్లవి పాత్ర నిజ జీవితంలో ఆమెదేనా..?

Virata Parvam Real Story : సాయిపల్లవి-రానా జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విరాటపర్వం.' ఈ నెల 17న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. వెన్నెల అనే పాత్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని దర్శకుడు వేణు ఊడుగుల చెబుతున్నారు. ట్రైలర్‌లోనూ ఇది వెన్నెల కథ అని చెప్పారు. యథార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ సినిమా కథపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలో సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్రపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ వెన్నెల పాత్ర నిజ జీవితంలో ఎవరిది.. ఎవరి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు..

1990వ దశకంలో విప్లవ భావాల పట్ల ఆకర్షితురాలై నక్సల్ ఉద్యమంలో చేరేందుకు వెళ్లిన 'తూము సరళ' కథే విరాటపర్వంలో వెన్నెల కథగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో కొన్ని భిన్న వాదనలు ఉన్నాయి. సరళ ప్రజల కోసం పోరాడేందుకే నక్సల్ బాట పట్టిందనేది ఒక వాదనైతే.. విప్లవ భావాల కన్నా శంకరన్న అనే మావోయిస్టు నాయకుడి పట్ల ఉన్న ఇష్టంతోనే దళంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిందనేది మరో వాదన. సరళ పుట్టింది పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఆమెది కమ్యూనిస్ట్ కుటుంబ నేపథ్యం. ఆమెలో విప్లవ భావాలు నాటుకోవడానికి కుటుంబ నేపథ్యం ఒక కారణమనే వాదన ఉంది.

అదే సమయంలో.. ఒకవేళ సరళకు విప్లవ భావాల పట్ల అంత ఆకర్షణ ఉంటే అప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్న దళాల్లో చేరి ఉండేదని.. కానీ ఆమె నిజామాబాద్‌కు వెళ్లడం కేవలం శంకరన్న కోసమేననే ప్రచారం ఉంది. అప్పట్లో నిజామాబాద్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిన సరళ.. అక్కడి స్థానిక కమిటీల సాయంతో శంకరన్న దళంలోకి వెళ్లగలిగిందని చెబుతారు. అయితే అప్పట్లో మావోయిస్టు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోలీసులు కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నందునా.. సరళపై కూడా శంకరన్న దళం ఎప్పుడూ అనుమానంతో ఉండేదనే ప్రచారం ఉంది. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడం కూడా అందుకు కారణమైందనే వాదన ఉంది. అలా సరళ ఇన్ఫార్మర్‌గా పనిచేస్తుందనే కారణంతో మావోయిస్టులే ఆమెను చంపారనే ప్రచారం ఉంది. ఆమెపై అత్యాచారం జరిపి చంపేశారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇదంతా పోలీసులు మావోయిస్టులను రాక్షసులుగా చిత్రీకరించేందుకు చేసిన దుష్ప్రచారమే అన్న వాదన కూడా ఉంది. 

ఇలా సరళ జీవితం చుట్టూ, ఆమె మరణం చుట్టూ అనేక రకాల వాదనలున్నాయి. అందులో అసలు నిజమేంటనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఆమె జీవితాన్ని ఇప్పుడు వెన్నెల పాత్రలో చూపించబోతున్న వేణు ఊడుగుల ఆ మిస్టరీకి ఎలాంటి కంక్లూజన్ ఇచ్చారనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. 

Also Read: Omicron Virus: కోరలు చాస్తున్న ఒమిక్రాన్..షాకింగ్ విషయాలు వెల్లడించిన రష్యన్ శాస్త్రవేత్తలు..!

Also Read: Chiranjeevi-kamal Haasan: చిరంజీవి ఇంట్లో క‌మ‌ల్ హాస‌న్.. పార్టీలో సల్మాన్‌ ఖాన్‌ సందడి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News