VVIPS Aya Savitri: సినీ హీరోల 'పిల్లల కేర్‌ టేకర్‌' ఎవరో తెలుసా? వీవీఐపీల ఆయా ఎవరో తెలుసా?

Klin Kaara Care Taker: సినీ ప్రముఖుల పిల్లలను సంరక్షిస్తూ ఆమె వీవీఐపీల ఆయాగా మారిపోయారు. పుట్టిన పిల్లలను చక్కగా చూసుకుని వారి ఆలనాపాలనను గమనిస్తూ వారి ఎదుగుదలతో కీలక పాత్ర పోషిస్తున్న వీవీఐపీ కేర్‌ టేకర్‌పై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె ఇప్పుడు రామ్‌చరణ్‌-ఉపాసనల పాప క్లీంకార బాధ్యతలు చూస్తున్నారనే వార్తతో అసలు ఆమె ఎవరు అని ఆరా తీస్తున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 6, 2024, 10:54 PM IST
VVIPS Aya Savitri: సినీ హీరోల 'పిల్లల కేర్‌ టేకర్‌' ఎవరో తెలుసా? వీవీఐపీల ఆయా ఎవరో తెలుసా?

VVIPS Care Taker: సినీ పరిశ్రమలో కొత్త వారసులు వస్తున్నారు. నటీనటుల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. కొత్త కుటుంబసభ్యుల రాకతో వారి వారి ఇళ్లల్లో ఆనందాలు నిండిపోతున్నాయి. అయితే తమకు పుట్టిన పిల్లలను ప్రత్యేకంగా.. అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లిదండ్రులు అవుతున్నారని తెలిసిన మొదటి రోజు నుంచి ప్రసవమై వారు పెరిగి పెద్దయ్యాకే ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా వారి పుట్టుక నుంచి వారి జీవితాన్ని అందంగా ప్రణాళిక వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రసవం నుంచే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల అగ్రతారలు రణ్‌బీర్‌ కపూర్‌-అలియా భట్‌, సైఫ్‌ అలీఖాన్‌-కరీనా కపూర్‌, షాహిద్‌ కపూర్‌ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అయితే వారికి పుట్టిన బిడ్డలను ప్రత్యేక సంరక్షణలో పెంచుతున్నారు.

Also Read: Imran Khan: బతకడం కోసం లగ్జరీ కారును అమ్మేసుకున్న ఒకప్పటి స్టార్‌ హీరో

పుట్టిన కొన్ని నెలలు పాపను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉండడంతో దీనికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఆయా వచ్చారు. ఆమె వీవీఐపీల ఆయాగా పేరుపొందారు. సినీ ప్రముఖుల ఇళ్లల్లో పుట్టే పసిపాపలను ప్రత్యేక జాగ్రత్తలతో ఆమె సంరక్షిస్తుండడంతో ఇప్పుడు ఆమెపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆమె ఎవరు? ఆమెకు ఇచ్చే జీతం ఎంత? ఎవరెవరి ఇళ్లల్లో పని చేశారు? వంటి ప్రశ్నలు అభిమానులు, ప్రజలు ఆసక్తిగా అడుగుతున్నారు. ఆ వీవీఐపీల ఆయా పేరు సావిత్రి.

Also Read: Fish Load Lorry: రోడ్డుపై విలవిలలాడిన చేపలు.. జాలి లేకుండా వాటిపైనే వెళ్లిన వాహనాలు

ఆమె వ్యక్తిగత వివరాలు ప్రపంచానికి తెలియడం లేదు. కానీ ఆమె ఓ ప్రముఖ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. నర్సుగా ఆమె సుదీర్ఘ కాలం పాటు చేశారని సమాచారం. అంతేకాదు పెద్ద సంఖ్యలో ప్రసవాలు చేసిన అనుభవం ఆమె సొంతం. అంతేకాకుండా ఆమె పుట్టిన పిల్లలను అత్యంత జాగ్రత్తగా పెంచుతారనే పేరు ఉంది. ఆమె పేరు అలా మార్మోగి ఇప్పుడు సినీ ప్రముఖులకు ప్రధాన ఆయాగా మారారు. సినీ నటీనటుల పిల్లల సంరక్షణ చర్యలు ఆమె చూస్తోంది. తాజాగా రామ్‌చరణ్‌-ఉపాసన ముద్దుల తనయ క్లీంకార బాధ్యతలు కూడా ఆమె చూస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇటీవల ముంబై పర్యటనకు వెళ్లిన చెర్రీ-ఉపాసన వెంట సావిత్రి కూడా ఉన్నారు. నిరంతరం చిన్నారి వెంట సావిత్రి ఉంటున్నారు. ఆమె సంరక్షణలో క్లీంకార ప్రత్యేకంగా పెరుగుతోందని తెలుస్తోంది. రెండేళ్ల వరకు సావిత్రితో ఒప్పందం చేసుకున్నారని చర్చ జరుగుతోంది.

వీవీఐపీల ఆయా
ప్రముఖుల ఆయాగా పేరొందిన సావిత్రి ప్రధానంగా బాలీవుడ్‌ ప్రముఖుల పిల్లలకు సేవ చేసింది. సైఫ్‌ అలీఖాన్‌-కరీనా కపూర్‌ కుమారుడు తైమూర్‌ అలీఖాన్‌ సంరక్షణ బాధ్యతలు సావిత్రి చూసుకున్నారు. సైఫ్‌, కరీనా బాబును ఎత్తుకుని తిరుగుతున్న సమయంలో వారి సావిత్రి కూడా కనిపించారు. సైఫ్‌, కరీనా నివాసానికి ఆమె రాకపోకలు సాగిస్తున్న వీడియోలు బాలీవుడ్‌ టౌన్‌లో వైరల్‌గా మారింది. ఆ సమయంలో హిందీ ప్రేక్షకులు 'తైమూర్‌ కీ నాని' అని పేరు పెట్టారు. అంటే 'తైమూర్‌ అవ్వ' అని పిలుస్తున్నారు. షాహిద్‌ కపూర్‌ కొడుకు, కూతుళ్ల బాధ్యత కూడా సావిత్రి చూసుకున్నారు.

జీతం ఎంత?
ప్రముఖుల పిల్లలు కావడంతో సావిత్రి అత్యంత జాగ్రత్తతో బాధ్యతలు చేపడుతుందనే పేరు ఉంది. అందుకే పలువురు ఆమెను ప్రత్యేకంగా పిలిచి సేవలు పొందుతున్నారు. అయితే ఆమె జీతం ఎంత ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఆమెకు సంబంధించిన వేతనం ముందే మాట్లాడుకుంటారని బాలీవుడ్‌ పరిశ్రమలో టాక్‌. ఏడాది నుంచి రెండేళ్లకు పైగా ఆమె సేవలు కావాల్సి ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తునే ఆమెకు చెల్లిస్తున్నారని సమాచారం. వాస్తవంగా అయితే నెలకు రూ.లక్షన్నరకు పైగా ఆమెకు ఇస్తున్నారని సినీ పరిశ్రమలో వినిపిస్తున్న మాట. ఇక ఆమె సేవలు నచ్చి పిల్లలు మంచిగా ఎదిగితే సావిత్రికి అదనంగా బహుమతులు వంటివి లభిస్తున్నాయని సమాచారం. సైఫ్‌, కరీనా కుటుంబం ఆమెకు జీతం కన్నా మిగతా కానుకలు కూడా సావిత్రికి ఇచ్చారని హిందీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతలా వీవీఐపీల ఆయాగా పేరొందిన సావిత్రి ఇప్పుడు మెగా మనమరాలు క్లీంకారకు సేవలు చేస్తుండడం విశేషం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News