Balakrishna in Rajinikanth Jailer 2:
జైలర్ 2 లో బాలయ్య నటించనున్నారా? ఇది ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అభిమానుల్ని అలరించిన జైలర్ పార్ట్ 1 తరువాత, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జైలర్ సినిమా.. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ కి బ్లాక్ బస్టర్ విజయం అందించిన సంగతి తెలిసిందే.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన జైలర్ సినిమా అన్ని భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో, రెండవ భాగం కోసం భారీ ఆశలు పెరిగాయి. రజినీకాంత్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదటి భాగంలో శివరాజ్ కుమార్, జాకీ షరాఫ్, మోహన్ లాల్ వంటి ప్రముఖ తారలతో.. స్క్రీన్ షేర్ చేయించిన సంగతి తెలిసి. ఈ క్రమంలో..రెండవ భాగంలో బాలీవుడ్‌తోపాటు తెలుగునుంచి కూడా ప్రముఖ.. తారలు ఉంటారనే ప్రచారం సాగుతోంది.
Also Read: Lagacharla Farmer: తెలంగాణ పోలీసులు మరో దారుణం.. బేడీలతోనే లగచర్ల రైతు ఆస్పత్రికి తరలింపు
జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తారనే వార్తలతో.. ఈ చిత్రంపై తెలుగు వారికి మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య ఇప్పటికే డాకు మహారాజ్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నా.. జైలర్ 2లో ఆయన ఊర మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రజనీకాంత్, బాలకృష్ణ కలిస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ఇద్దరి మాస్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని.. సినిమాకు ప్రత్యేక స్థానం లభిస్తుందని సౌత్ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా బాలయ్య తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో తన ప్రభావాన్ని చూపడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది.
కాగా జైలర్ 2 కథ, బాలయ్య పాత్రపై అధికారిక ప్రకటన వస్తే, ఇది తెలుగు సినిమా అభిమానులకే కాకుండా, అన్ని భాషల ప్రేక్షకులకూ హ్యాపీ న్యూస్ గా నిలుస్తుంది. మరి నిజంగానే ఈ సినిమాలో బాలయ్య.. కనిపిస్తారా లేదా అనేది తెలియాలి అంటే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
Also Read: KT Rama Rao: రైతుకు సంకెళ్లు రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.