Super Jodi: సూపర్ జోడీ.. ఉదయభాను యాంకర్ గా జీ తెలుగు సరికొత్త డ్యాన్స్ రియాలిటీ షో

Telugu Glamourous Dance Reality Show: సరికొత్త సీరియల్స్.. ప్రోగ్రామ్స్ అందించడంలో ఎప్పుడు జీ తెలుగు ముందుంటుంది. ముఖ్యంగా టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ సరికొత్త రియాలిటీ షోలు అందించడంలో ప్రస్తుత బుల్లితెర ఛానల్లో జీ తెలుగు కి సాటి లేదనే చెప్పొచ్చు. ఇప్పుడు అదే ఫాలో అవుతూ మరో రియాలిటీ షో తో మనం ముందుకి వస్తోంది జీ తెలుగు..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2024, 08:24 PM IST
Super Jodi: సూపర్ జోడీ.. ఉదయభాను యాంకర్ గా జీ తెలుగు సరికొత్త డ్యాన్స్ రియాలిటీ షో

Zee Telugu Reality Show: కొత్త టాలెంట్ ని వెలుగులోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చెయ్యడానికి రియాలిటీ షోలు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి రియాలిటీ షో లని ఎంకరేజ్ చేస్తూ.. ఎప్పుడు ఏదో ఒక క్రియేటివ్ ఐడియా తో.. కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకి సరికొత్త రియాలిటీ షోలు తీసుకొస్తుంది జీ తెలుగు. తెలుగు ప్రేక్షకులను అలరించేలా సరికొత్త కాన్సెప్ట్లతో రియాలిటీ షోలను అందిస్తున్న ఛానల్ జీ తెలుగు. 

ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు ఆదివారం మరింత వినోదాన్ని అందించడానికి డ్రామా జూనియర్స్, తెలుగు మీడియం ఐస్కూల్ వంటి షోలను అందించిన  జీ తెలుగు ఈ వారం నుంచి మరో సరికొత్త షోతో మన ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడితో కలిసి డ్యాన్స్లో తమ ప్రతిభను నిరూపించుకునే షో సూపర్ జోడీ. 

ప్రముఖ యాంకర్ ఉదయభాను హోస్ట్ చేయనున్న ఈ షోలో దాదాపు ఎనిమిది జోడీలు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ప్రేక్షకులకు అద్భుతమైన వినోదం అందించడానికి సిద్దమైన సూపర్ జోడీ జనవరి 28న ప్రారంభమై ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు, మీ అభిమాన ఛానల్ జీ తెలుగులో ప్రసారం అవుతుంది.
తెలుగు టెలివిజన్ లో బిగ్గెస్ట్ సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షోగా ప్రేక్షకులను అలరించనున్న సూపర్ జోడీలో ఎనిమిది జంటలు టైటిల్ కోసం పోటీపడతారు. 

కాగా ఈ షోకు ఎవర్ గ్రీన్ నటి మీనా జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అలానే ప్రముఖ కొరియోగ్రాఫర్ మాస్టర్ రఘు, అందాల హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ కూడా మీనాతో పాటు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 

8 సూపర్ జోడీలు.‌ ఉదయభాను అందం.. ముగ్గురు సూపర్ జడ్జీల తో మనల్ని ప్రతి ఆదివారం మంత్రముగ్ధులను చేసే కోసం సిద్ధమైపోతోంది ఈ షో.

Also Read: IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!

Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News