అనుష్కకు బంపర్ ఆఫర్: మెగాస్టార్ మూవీలో ఛాన్స్ !

బాహుబలి హీరోయన్ అనుష్కకు బంపర్ ఆఫర్ వచ్చింది

Last Updated : Feb 5, 2019, 10:46 AM IST
అనుష్కకు బంపర్ ఆఫర్: మెగాస్టార్ మూవీలో ఛాన్స్ !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరపైకి ఎక్కిస్తున్న సైరా మూవీ ఘూటింగ్ యుద్ధప్రాతిపదికన జరగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేస్ పూర్తి చేసుకొని ..రెండో ఫేస్ ఘూటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లో అనుష్క కూడా జాయిన్ కానుందని సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. తమన్నా కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడిదే వరసలో అనుష్క పేరు కూడా వినిపిస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఫోకస్ పెరుతోంది .

మరికొన్ని చోట్ల అనుష్క సినిమాలోని ఒక సందర్భంలో పవర్ ఫుల్ వారియర్ గా కనిపిస్తుందనే బజ్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. ‘సైరా’ లో అనుష్క పాత్ర అనేది జస్ట్ రూమరా..? లేక నిజమేనా అనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే మార్చి నుండి సెట్స్ పైకి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది

 

Trending News