Tollywood Heroes Remuneration: అసలు ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన తెలుగు హీరోల సినిమాలు వందల కోట్లు రాబడుతున్నాయి. దీంతో మన హీరోలు అదే రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇందులో ఏ హీరో పారితోషకం ఎంతంటే.. ?
ప్రభాస్ (Prabhas) రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ భారత్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్.. (Pawan Kalyan) పవన్ కళ్యాన్ దాదాపు ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల రేంజ్లో పారితోషకం తీసుకుంటున్నారు.
మహేష్ బాబు (Mahesh Babu) మహేష్ బాబు ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రాజమౌళి సినిమా కోసం ఏకంగా రూ. 140 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ (NTR) ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ప్యాన్ ఇండియా లెవల్‌కి పెరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీకి రూ. 40 కోట్ల రెమ్యురేషన్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవరతో పాటు హిందీలో చేస్తోన్న వార్ 2 కోసం ఏకంగా రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
రామ్ చరణ్ (Ram Charan) ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న 'గేమ్ ఛేంజర్' మూవీ కోసం రూ. 60 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్ (Allu Arjun) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇపుడు పుష్ప 2 తర్వాత తన పారితోషకం పెంచే అవకాశాలున్నాయి.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులున్న ఒక్కో సినిమా కోసం రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.
నాని (Nani) నాచురల్ స్టార్ నాని ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.