అభిమానులకు గుడ్ న్యూస్; మళ్లీ జతకట్టనున్న అర్జున్ రెడ్డి జంట

                            

Last Updated : Mar 8, 2019, 08:10 PM IST
అభిమానులకు గుడ్ న్యూస్; మళ్లీ జతకట్టనున్న అర్జున్ రెడ్డి జంట

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర లేదు.  ఈ సినిమాతో ఇటు విజయ్‌కు అటు హీరోయిన్‌ శాలినీ పాండేకు మంచి గుర్తింపు లభించడంతో పాటు మంచి అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. అయితే అప్పటి నుంచి ఈ హిట్ జంట మళ్లీ తెరపైకి కలిసినటించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ జంటగా తెరపైకి కనిపించేందుకు రెడీ అవుతన్నారు

టాలీవుడ్ నుంచి అందించిన సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అతిత్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సైమల్టేనియస్ గా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరైకి ఎక్కబోతున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు . ఈ మేరకు చెన్నైలో బైక్ రేసింగ్ కు సంబంధించి వారం రోజులు ట్రైనింగ్ కూడా పూర్తిచేశాడట.అయితే ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అఫీషియల్ స్టేట్ మెంట్ ఇంకా రాలేదు.

Trending News