'కోబ్రా' ఫస్ట్ లుక్ విడుదల

'అపరిచితుడు' 'విలన్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో చియాన్ విక్రమ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'కోబ్రా'. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

Last Updated : Feb 29, 2020, 11:05 AM IST
'కోబ్రా' ఫస్ట్ లుక్ విడుదల

'అపరిచితుడు' 'విలన్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో చియాన్ విక్రమ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'కోబ్రా'. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. 

'కోబ్రా' సినిమాలో చియాన్ విక్రమ్ ఏడు పాత్రలు పోషిస్తున్నారు.  శాస్త్రవేత్త, రాజకీయనాయకుడు, ప్రొఫెసర్‌, మతబోధకుడు.. ఇలాంటి  ఏడు పాత్రల్లో ఆయన కనిపించనున్నారు. ఏడు పాత్రలతో కూడిన కోబ్రా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. విక్రమ్ .. వెనక్కి తిరిగి అరుస్తూ కనిపిస్తుండగా.. మిగతా ఏడు పాత్రలు అద్దంలో కనిపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. విక్రమ్ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారిగా ఓ కీలక పాత్రలో కనించనున్నాడు.  

Read Also: దర్శకుడు శంకర్‌పై 2గంటలపాటు సీబీఐ ప్రశ్నల వర్షం

'కోబ్రా' చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ సమ్మర్ కు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. సినిమాలో 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో సినిమా అంచనాలు పెరిగాయి. ఫస్ట్ లుక్ చాలా బాగుందని..  నెటిజనులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. 

Trending News