త్వరలో భారత మార్కెట్లోకి రానున్న 'ఈ సిమ్‌'లు

ఈసిమ్ అనేది మొబైల్ ఫోన్ల కొరకు రూపొందించిన సిమ్ కార్డు.

Last Updated : Mar 11, 2018, 09:10 PM IST
త్వరలో భారత మార్కెట్లోకి రానున్న 'ఈ సిమ్‌'లు

ఈ-సిమ్(eసిమ్) అనేది మొబైల్ ఫోన్ల కొరకు రూపొందించిన సిమ్ కార్డు. ఈ-సిమ్ కార్డులో మొబైల్ సబ్ స్క్రైబర్‌కు సంబంధించిన అన్ని రకాల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది.

ఈ-సిమ్‌లను ఒక ఇంటిగ్రేటెడ్ సిమ్ రూపంలో తీసుకువస్తున్నారు. దీనిని మొబైల్ ఫోన్ నుండి వేరుచేయలేరు. ఫోన్ సైజు తగ్గించే క్రమంలో టెక్నాలజీ కంపెనీలు కొత్తగా ఈ-సిమ్‌లను తెస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీ వలన ఫోన్‌లో ఈయూఐసీసీ(ఎంబైడెడ్ యూనివర్సల్ సర్క్యూట్ కార్డు)చిప్ సిమ్‌లా పనిచేస్తుంది.  దీన్ని ఏ టెలికాం ఆపరేటరైనా, ఎన్నిసార్లైనా రీరైట్ చేయవచ్చు. నెట్వర్క్ మారితే ఈ చిప్‌లోకి సదరు నెట్వర్క్ వారు తమ ఫైలు వేయడంతో సేవలు మొదలైతాయి.

స్మార్ట్ ఫోన్ల వంటి ఎం2ఎం పరికరాల్లో సిమ్ కార్డును మార్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుచేత ఈ-సిమ్ కోసం డ్రైవర్‌ను తీసుకువచ్చారు. దీనిని మొబైల్ యూజర్ పరికరాలలో కూడా ఉపయోగిస్తారు. ఈ-సిమ్ వాడకాన్ని మొదలుపెట్టిన తొలి కంపెనీగా 'యాపిల్' నిలిచింది.  యూఎస్ఏలో ఆపిల్ ఐప్యాడ్ లకు యాపిల్ ఈ టెక్నాలజీ వాడుతోంది. ఇక ఇదే తరహాలో కొత్త ఐసిమ్‌ల టెక్నాలజీ కూడా వచ్చింది. ఈసిమ్ జీఎస్ఎంఏ (గ్లోబల్ సిస్టం ఫర్ మొబైల్ కమ్యునికేషన్ అసోసియేషన్) ద్వారా జనరేట్ అవుతుంది. త్వరలో భారత్‌లో ఈ తరహా సిమ్ కార్డులు అందుబాటులో రానున్నాయని సమాచారం.

Trending News