టిక్.. టిక్.. టిక్..హిట్

విశ్వక్‌సేన్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'హిట్'. ఈ సినిమాకు నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాని నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రెయిలర్ సినిమాపై అంచనాలు పెంచింది.

Last Updated : Feb 25, 2020, 12:24 PM IST
టిక్.. టిక్.. టిక్..హిట్

విశ్వక్‌సేన్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'హిట్'. ఈ సినిమాకు నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాని నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రెయిలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఐతే తాజాగా హిట్ స్నీక్ పీక్ పేరుతో మరో వీడియో విడుదల చేసింది చిత్ర బృందం.

వాల్ పోస్టర్ బ్యానర్ పై చిత్రం రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయింది. సినిమాను ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హిట్ స్నీక్ పీక్ పేరుతో మూవీలోని ఓ పీక్ పార్ట్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో హీరో విశ్వక్ సేన్ .. ఓ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. హీరో విశ్వక్ సేన్.. పొదల్లో పాతి పెట్టిన ఓ మహిళ మృతదేహాన్ని చాకచక్యంగా కనుక్కుంటాడు. ఈ సీన్ ఉత్కంఠ భరితంగా చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది.

 

Trending News