త్రివిక్రమ్-ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ' టీజర్ (వీడియో..)

త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'అరవింద సమేత వీర రాఘవ'.

Last Updated : Aug 15, 2018, 04:42 PM IST
త్రివిక్రమ్-ఎన్టీఆర్  'అరవింద సమేత వీర రాఘవ' టీజర్ (వీడియో..)

త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'అరవింద సమేత వీర రాఘవ'. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

ఈ టీజర్ లో ఎన్టీఆర్‌ యాక్షన్‌ సీన్స్‌ అభిమానులను కట్టిపడేశాయి. కత్తి పట్టుకోని ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ‘కంటపడ్డావా కనికరిస్తానేమో.. వెంట టపడ్డానా నరికేస్తా ఓబా’ అనే డైలాగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు డైలాగ్స్‌ సైతం ఆకట్టుకుంటున్నాయి.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో అరవింద సమేత సినిమాపై భారీ అంచనాలున్నాయి.

తారక్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇదే. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఎన్టీఆర్ కనిపిస్తాడట. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ఎలివేట్ చేసే షాట్స్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయని మూవీ యూనిట్ చెబుతోంది.

అరవింద సమేత టీజర్‌లోని దృశ్యాలు

ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీలక పాత్రల్లో జగపతిబాబు, నాగబాబు తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో 'అరవింద సమేత' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

Trending News