అర్జున్ రెడ్డి డైరెక్టర్ చేతిలో సల్మాన్ ఖాన్ సినిమా ?

అర్జున్ రెడ్డి సినిమాతో తన తొలి ప్రయత్నంలోనే సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు బాలీవుడ్‌లో ఏకంగా సల్మాన్ ఖాన్‌నే డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.

Last Updated : Jun 30, 2019, 04:30 PM IST
అర్జున్ రెడ్డి డైరెక్టర్ చేతిలో సల్మాన్ ఖాన్ సినిమా ?

అర్జున్ రెడ్డి సినిమాతో తన తొలి ప్రయత్నంలోనే సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. 'అర్జున్ రెడ్డి' సృష్టించిన సునామి చూసిన తమిళ, హిందీ సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను అక్కడ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అలా హిందీలో 'కబీర్ సింగ్' పేరిట రీమేక్ అయిన సినిమా ఇటీవలే విడుదలై బాలీవుడ్‌లోనూ బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రను కబీర్ సింగ్ సినిమాలో షాహీద్ కపూర్ నటించగా శాలిని పాండే పాత్రను కియారా అద్వాని పోషించింది. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన టీ సిరీస్ నిర్మాణ సంస్థ ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ సల్మాన్ ఖాన్‌ని డైరెక్ట్ చేసే అవకాశం సందీప్ రెడ్డికి వచ్చినట్టయితే, ఇక బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి కెరీర్‌కి మరింత బలమైన పునాధి పడినట్టే అవుతుంది. ఇదిలావుంటే, ఇటు టాలీవుడ్‌లోనూ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సందీప్ సినిమా చేసే అవకాశాలున్నాయనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Trending News