రాఘవ లారెర్స్ మూవీ, డబుల్ మాస్ ఎంటర్ టైనర్ కాంచన-3 సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న విసయం తెలిసిందే. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ ను దాటిన ఈ మూవీ సౌత్ మూవీ టాప్ -5 మూవీలో స్థానం సంపాదించుకుంది.
ఈ క్రమంలో కాంచన-3 సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి ఎంటరైంది. నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బ్రేక్-ఈవెన్ క్రాస్ చేసి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైంది. ఇంకా చెప్పాలంటే ఈ 2 వారాల్లో బయ్యర్లకు 7 కోట్ల రూపాయల లాభం తెచ్చిపెట్టింది ఈ మూవీ.
విడుదలైన ఈ 14 రోజుల్లో కాంచన-3కి ఏపీ,నైజాం కలుపుకొని 17 కోట్ల 78 రూపాయల షేర్ వచ్చింది. థియేట్రికల్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి ఎంటరై దాదాపు 4 రోజులు అవుతోంది. బి, సి సెంటర్లలో స్ట్రాంగ్ గా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చింది.