1134 Movie: మూడు పాత్రల చుట్టూ 1134.. ఆడియన్స్‌ థ్రిల్ అయ్యారా.. జీరో బడ్జెట్ మూవీ ఎలా ఉందంటే..?

1134 Movie Review: జీరో బడ్జెట్‌తో తెరకెక్కిన 1134 మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది..? ప్రయోగాత్మక చిత్రం ప్రేక్షకులకు నచ్చిందా..? రివ్యూలో చుద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 08:40 PM IST
1134 Movie: మూడు పాత్రల చుట్టూ 1134.. ఆడియన్స్‌ థ్రిల్ అయ్యారా.. జీరో బడ్జెట్ మూవీ ఎలా ఉందంటే..?

1134 Movie Review: సరికొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌కు నచ్చేలా సినిమాలను తెరకెక్కిస్తూ.. వెండితెరపై వండర్స్ క్రియేట్ చేస్తున్నారు న్యూ ఏజ్ మేకర్స్. కాన్సెప్ట్ చిన్నదే అయినా.. ప్రేక్షకులను కట్టిపడేసేలా రూపొందిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రమే 1134. నో బడ్జెట్ అంటూ అందరూ తలో చేయి వేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. నేడు (జనవరి 5న) థియేటర్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా..? ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ ఏంటంటే..?

1134 మూవీ కథ మొత్తం ముగ్గురి మధ్య జరుగుతుంటుంది. లక్ష్మణ్ (ఫణి శర్మ), ఎరిక్ (గంగాధర్ రెడ్డి), హర్ష్ (ఫణి భార్గవ్) చుట్టు స్టోరీ అల్లుకున్నాడు. ఈ ముగ్గురిని కిడ్నాప్ చేసి ఒకే దగ్గర కట్టి పడేస్తారు. ఏటీఎంలో ఉండే కెమెరాలు హ్యాక్ చేయడం.. బస్టాప్‌లో వద్ద దొంగతనం చేయడం.. ఏటీఎంను హ్యాక్ చేసి  డబ్బులు తీసుకుంటూ ఉంటారు. దొంగతనాలు చేసుకుంటూ ఉండే ఈ ముగ్గురికి ఉన్న లింక్ ఏంటి..? వీళ్లు అసలు ఎందుకు దొంగలుగా మారారు..? ఈ ముగ్గురిని కలిపి ఆ క్రైమ్ కథ ఏంటి? 11 34 అంటే ఏంటి..? చివరకు ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు..? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

ఎవరు ఎలా చేశారంటే..?

అందరూ కొత్త నటీనటులతో సినిమా చేయాలంటే సాహసమనే చెప్పాలి. ఈ సినిమాలో కొత్త వాళ్లే అయినా అందరూ చక్కగా నటించారు. కృష్ణగా కృష్ణ మదుపు, ఎరిక్‌గా గంగాధర్ రెడ్డి, హర్షగా ఫణి భార్గవ్, లక్ష్మణ్‌గా ఫణి శర్మ తమ పాత్రల్లో జీవించేశారు. యాక్షన్, ఎమోషన్స్, కామెడీ అన్ని యాంగిల్స్‌లో తమ ప్రతిభను చాటుచుకున్నారు. వీరిని డైరెక్టర్ చక్కగా వాడుకున్నారు. 

ఎలా ఉందంటే..?

డైరెక్టర్ శరత్ తాను పేపర్‌పై రాసుకున్న ప్రతీ సీన్‌ను తెరపై చక్కగా చూపించాడు. క్రైమ్, రాబరి, మిస్టరీ, సస్పెన్స్ ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ సరికొత్త ప్రయోగం చేశాడు. అయితే తాను అనుకున్న పాయింట్ ఎక్కడా డివియేట్ అవ్వకుండా తెరకెక్కించాడు. మూడు పాత్రల పరిచయం, ఫ్లాష్ బ్యాక్, నేపథ్యంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.

ద్వితీయార్థంలో చిక్కుముడులన్నీ విప్పినట్టుగా ఉంటాయి. ఆ ముగ్గరు వెనుక ఉన్నది ఎవరు..? వారి చేత ఆ నేరాలు చేయింస్తుంది ఎవరు..? దీని వెనుక ఉన్న ఫ్లాష్‌ బ్యాక్ ఏంటి..? అనేది డైరెక్టర్ ఆసక్తికరంగా మలిచాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చే ట్విస్టులు మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా ఆడియన్స్‌ను థ్రిల్ చేయడంలో మాత్రం 1134 సక్సెస్ అవుందనే చెప్పొచ్చు. ఇక టెక్నికల్‌గా ఈ మూవీ హైస్థాయిలో ఉంది. కెమెరా వర్క్, ఆర్ఆర్ ప్రధాన బలంగా నిలిచాయి. శాన్వీ మీడియా, నిర్మాత భరత్ కుమార్ పాలకుర్తి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. 

రేటింగ్: 2.5

 

Trending News