సాహో మూవీ విడుదల వాయిదా!

సాహో సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు ఇదో చేదు వార్త.

Last Updated : Jul 19, 2019, 02:08 PM IST
సాహో మూవీ విడుదల వాయిదా!

హైదరాబాద్‌: సాహో సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు ఇదో చేదు వార్త. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కావాల్సి వున్న సాహో సినిమా ఆగస్టు 30వ తేదీకి వాయిదా పడింది. కంటెంట్‌, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో సినిమా విడుదలను మరో 15 రోజులు వాయిదా వేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ ప్రకటించింది. పోరాట దృశ్యాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మరింత సమయం అవసరం కావడంతో విడుదల తేదీని వాయిదా వేసినట్టు యూవీ క్రియేషన్స్ ఈ ప్రకటనలో పేర్కొంది. 

రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. బాహుబలి సినిమాతో బాలీవుడ్‌లోనూ ప్రభాస్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అందుకే సాహో సినిమాను సైతం ప్రపంచస్థాయి హంగులతో టాలీవుడ్‌తో పాటు హిందీ, తమిళం భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా జాకీ ష్రాఫ్, నీల్‌ నితిన్‌, చుంకీ పాండే, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ, వెన్నెల కిశోర్‌, ప్రకాశ్‌ బేలవాది, ఎల్విన్‌ శర్మ, మహేష్‌ మంజ్రేకర్‌, టినూ ఆనంద్‌, లాల్‌, శరత్‌ లోహితశ్వా ముఖ్య పాత్రలు పోషించారు. 

Trending News