Mango: మామిడి పండు తొక్క వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆఖరికి క్యాన్సర్ కూడా!

Mango Health Benefits : సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మామిడిపళ్ళు. మండే ఎండల్లో మనకి ఎంతో ఊరటం కలిగించే మామిడిపళ్ళ వల్ల ఆరోగ్యానికి కూడా లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయి. మామిడి పండులో మాత్రమే కాక మామిడి తొక్క వల్ల కూడా మనం ఊహించనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 16, 2024, 06:40 PM IST
Mango: మామిడి పండు తొక్క వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆఖరికి క్యాన్సర్ కూడా!

Mango for Diabetics : వేసవికాలం అనగానే సెలవులు కాకుండా అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది మామిడి పండ్ల కోసం. సమ్మర్ వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేది మామిడిపళ్ళనే. నోటికి రుచి తో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మామిడి పండు ని అందుకే పండ్ల రాజు అని పిలుస్తారు.

ఒకపక్క ఎండలు మండిపోతూ ఉంటే మరోవైపు చల్లగా మామిడి పళ్ళు తింటూ ఉంటే ఆ మజానే వేరు. ఆఖరికి షుగర్ ఉన్నవారు కూడా మామిడి పండ్ల కి దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉండే మామిడి పళ్ళని షుగర్ ఉన్న వాళ్ళు కూడా తక్కువ మోతాదు లో తినవచ్చు.

మామిడి పండు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా తినడానికి ఇష్టపడతారు. కొందరు ఐస్ క్రీమ్, స్వీట్స్ చేసుకుని తినడానికి ఇష్టపడితే మరికొందరు లస్సీ చేసుకుని తాగుతారు. అయితే కొంతమంది మామిడిపండ్లని తొక్క తీసేసి కూదా తింటారు. కానీ దాన్లో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. మామిడి తొక్క లో మాంగిఫెరిన్, బెంజోఫెనోన్ అనే క్రిమినాశక గుణాలు ఉంటాయి. కాబట్టి మామిడి తొక్క ను క్రిమిసంహారక మందుగా కూడా వాడొచ్చు. 

మామిడి పళ్ళు అంటే బాగా ఇష్టం ఉన్న షుగర్ పేషంట్స్ మ్యాంగో పీల్ టీ లేదా డీటాక్స్ డ్రింక్ తాగితే బాడీలోని షుగర్ లెవల్ బ్యాలెన్స్ అవుతాయట. అలాగే మామిడి తొక్కలకు యాంటి డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అందులో ఉండే మాంగిఫెరిన్ రక్తంలో చక్కెర లెవెల్ ను కంట్రోల్ చేయడంలో,  ఇన్సులిన్ ను మెరుగ్గా చేయడంలో సహాయపడుతుంది.

అలాగే మామిడి తొక్కలో పాలిఫెనాల్ లో కెరోటినాయిడ్ ఫోటోప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. అవి చర్మానికి అప్లై చేస్తే యూవీ కిరణాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అంతే కాకుండా మామిడి తొక్కలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు, బయోయాక్టివ్ పదార్థాలు కూడా ఉండడంతో అవి నోటిలో బ్యాక్టీరియా ను నిర్మూలిస్తాయి. కాబట్టి మామిడితొక్కని నమిలి మౌత్‌వాష్‌ గా కూడా వాడేయచ్చు. దంతక్షయం, చిగుళ్ళు వ్యాధులను కూడా మామిడి తొక్క నివారించగలదు.

మామిడితొక్కలో ఉండే టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ గాయాలను ఎండబెట్టే లక్షణాలు ఉంటాయి. ఏదైనా గాయం అయిన చోట మామిడితొక్క సారాన్ని పూస్తే, ఆ గాయం వేగంగా మానిపోయి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మామిడితొక్కలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పులు, పేగుల వాపుని కూడా తగ్గిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మామిడితొక్కలో క్యాన్సర్‌ని నిరోధించే గుణాలు ఉన్నాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. మాంగిఫెరిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా తగ్గిస్తుందట.

Also read: Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News