Coconut Water Side Effects: కొబ్బరి నీళ్లు తాగడం శరీరానికి ఎంతో మంచిది. కానీ కొంతమంది అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని లీటర్లకు లీటర్లు ఈ కొబ్బరి నీళ్లను తాగుతున్నారు. ఇలా అతిగా తాగడం వల్ల శరీరానికి చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఇటీవలే అధ్యయనాల్లో రుజువైంది. ప్రతిరోజు అతిగా కొబ్బరి నీళ్లు తీసుకునే వారిలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే అతిగా ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అతిగా కొబ్బరి నీళ్లు తాగితే కలిగే దుష్ప్రభావాలు ఇవే:
క్రీడాకారులు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు:
ఆటల్లో పాల్గొనే క్రీడాకారులు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అలసిపోయే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే పరిశోధనలో వెళ్లడైంది. ఈ కొబ్బరినీళ్ళలో సాధారణ నీటిలో ఉండే సోడియం కంటే ఎక్కువ పరిమాణంలో ఉంటుందని, ఈ నీటిని అతిగా తాగడం వల్ల అలసిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చర్మంపై అలర్జీ రావచ్చు:
అతిగా కొబ్బరి నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నీటిలో ఉండే మూలకాలు అలర్జీ వంటి సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ కొబ్బరి నీళ్లను అతిగా తాగడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అలర్జీ సమస్యలు తీవ్రతరమై తీవ్ర చర్మ సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది.
మధుమేహం ఉన్నవారు తాగొచ్చా:
కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని మధుమేహంతో బాధపడుతున్న వారు అతిగా తాగడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు కొబ్బరి నీళ్లను రోజు తాగకపోవడం చాలా మంచిది.
జీర్ణక్రియ పై ప్రభావం:
అతిగా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని గుణాలు పొట్ట సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇప్పటికే పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని అతిగా తాగకపోవడం చాలా మంచిది.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
ఇలా చేస్తున్నారా:
ప్రస్తుతం చాలామంది కొబ్బరి నీళ్లను బాటిల్లో క్యారీ చేస్తున్నారు. ఇలా చేసిన చెయ్యడం వల్ల అందులో ఉండే పోషకాలన్నీ తగ్గిపోయే ఛాన్స్ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కొబ్బరిని కొట్టిన వెంటనే తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్పృహ కోల్పోయే అవకాశం:
కొబ్బరి నీళ్లు అతిగా తాగడం వల్ల హైపర్‌కలేమియా వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దీని కారణంగా శరీర బలహీనత తలనొప్పి, స్పృహ కోల్పోవచ్చని వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు సమస్య రావొచ్చు:
అతిగా కొబ్బరి నీళ్లను తాగే వారిలో రక్త పోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇటీవలే చాలామందిపై చేసిన పరిశోధనల్లో ఇది తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కొబ్బరినీళ్లను అతిగా తాగడం మానుకోవాల్సి ఉంటుంది.
మూత్రవిసర్జన సమస్యలు రావచ్చు:
పరినీటిని అతిగా తాగడం వల్ల మూత్ర విసర్జన సమస్యలు మూత్ర విసర్జన సమస్య రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే మూత్ర విసర్జన సమస్యలతో బాధపడేవారు ఈ కొబ్బరినీళ్ళను అతిగా తాగడం మానుకోవాల్సి ఉంటుంది.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook