కేన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే గైనకోలాజికల్ కేన్సర్ ఒకటి. ఇందులో ఐదురకాలుంటాయి. వీటి లక్షణాలు చాలావరకూ వేరైనా..కొన్ని ఒకేలా ఉంటాయి.
కేన్సర్ అనేది ఓ ప్రాణాంతక వ్యాధి. కేన్సర్ వ్యాధిన పడి ప్రతియేటా చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇది శరీరంలోని ఓ భాగం నుంచి ప్రారంభమై..సమయానికి చికిత్స లేకుంటే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. కేన్సర్ కణాలు అదుపులేకుండా పెరిగిపోవడం వల్ల వ్యాధి తీవ్రమౌతుంది. అందుకే కేన్సర్ లక్షణాల్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సాధారణంగా ఏ అంగంలో కేన్సర్ సోకుతుందో నిర్ధారణ కూడా దాన్నించే అవుతుంది. కొన్ని కేన్సర్‌లు లింగ ఆధారితమైనవి. మహిళలకు వచ్చే గైనకోలాజికల్ కేన్సర్ ఆలాంటిదే. ఈ కేన్సర్‌లో ఐదు రకాలుంటాయి. ఇవి ప్రాణాంతకమైనవి. ఇందులో విభిన్న లక్షణాలున్నా..కొన్ని ఒకేలా ఉంటాయి. కేన్సర్ ఎక్కడ ఉందో నిర్ధారించడం ఆలస్యమౌతుంటుంది. అందుకే ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో చూద్దాం.
మహిళల్లో వచ్చే కేన్సర్ ఇది. మహిళలకు పెల్విక్స్ లోపల విభిన్న ప్రాంతాల్లో మొదలౌతుంది. ఇందులో కడుపు దిగువన ఎముకల మధ్యభాగంలో ఉంటుంది. వీటిలో వెజైనల్ కేన్సర్, వల్వర్ కేన్సర్, ఒవేరియన్ కేన్సర్, సర్వైకల్ కేన్సర్ ఉన్నాయి.
లక్షణాలేంటి
నడుము నొప్పి, యోనిలో దురద, మంట, నొప్పి, బ్లోటింగ్, వెజైనల్ బ్లీడింగ్ డిశ్చార్జ్, పెల్విక్స్ నొప్పి, మూత్రం ఆపుకోలేకపోవడం
ఎవరు జాగ్రత్త వహించాలి
గైనకోలాజికల్ కేన్సర్ ఏ మహిళకైనా రావచ్చు. కానీ పరిగణలో తీసుకోవల్సిన అంశాలు కూడా ఉన్నాయి. కేన్సర్ ముప్పును ఇవి పెంచుతాయి. స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్, స్థూలకాయం, 55 ఏళ్లు దాటినవాళ్లు.
లక్షణాలు కన్పిస్తే ఏం చేయాలి
ప్రారంభదశలో చికిత్స జరిగితే ఇది ప్రాణాంతకం కాకపోవచ్చు. లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కేన్సర్ నిర్దారణకు ఎండోమెట్రియల్ టిష్యూ పరీక్ష ఉంటుంది. యుటెరైన్, సర్వైకల్ కేన్సర్ కోసం పైప్ స్మియర్ టెస్ట్, సర్విక్స్, వెజైనా, యూటెరస్, ఫాలోపియన్ ట్యూబ్, ఒవేరియన్, టెక్టమ్ పరీక్ష కోసం పెల్విక్స్ టెస్ట్ ఉంటాయి.
రక్షణ ఎలా
గైనకోలాజికల్ కేన్సర్ నుంచి కాపాడుకునేందుకు హెచ్‌వీపీ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. వల్వర్ కేన్సర్, సర్వైకల్ కేన్సర్, వెజైనా కేన్సర్ ముప్పును ఈ వ్యాక్సినేషన్ తగ్గిస్తుంది. 11 నుంచి 12 ఏళ్ల వయస్సు అమ్మాయిలు ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది కాకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి.
Also read: Sore Throat: గొంతు గరగర, నొప్పి సమస్యలు అద్భుతమైన చిట్కాలు, చిటికెలో దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook