కోపాన్ని ఇలా ఆపుదాం ..!

కోపంగా ఉంటే ఏం చేస్తారు? ఓ నాలుగు మాటలు అనేస్తారు. ఎదుటోడి మనసును గాయపరుస్తారు.

Last Updated : Jan 21, 2018, 09:38 AM IST
కోపాన్ని ఇలా ఆపుదాం ..!

కోపంగా ఉంటే ఏం చేస్తారు? ఓ నాలుగు మాటలు అనేస్తారు. ఎదుటోడి మనసును గాయపరుస్తారు. మీ గురించి తెలిసినవారు అయితే లైట్ తీసుకుంటారు... కానీ అందరూ అలా తీసుకోరు కదా. 'తన కోపమే తన శత్రువు అన్నట్లు' కోపతాపాల వల్ల మనిషి గౌరవం కూడా తగ్గుతుంది. కానీ కోపాన్ని తగ్గించుకోవడం అంత సులువు కాదు.  ఎంతకీ కోపం కంట్రోల్ కాకపోతే ఈ చిన్న చిట్కాలు పాటించమని చెబుతున్నారు కొందరు విదేశీ మానసిక నిపుణులు

* కోపంలో ఉన్నప్పుడు 1 నుంచి 10 వరకు అంకెలను వెనుక నుండి లెక్కపెట్టండి (10,9,8... 1). ఇలా చేస్తే ఆవేశం తగ్గుతుంది.రక్తపోటు అదుపులోకి వస్తుంది. కోపం నియంత్రణలోకి వస్తుంది. 

* కోపంగా ఉన్నప్పుడు మీకిష్టమైన సంగీతం వినండి. లేకపోతే పాటలు వినండి. ఇవి వింటే మనసు తేలికవుతుంది.. ప్రశాంతత లభిస్తుంది.

* కోపంగా ఉన్నప్పుడు మనసు మళ్లించే పనులు చేయాలి. వీడియో గేమ్, వంటలు, పుస్తకాలు, బొమ్మలు వేయడం.. లాంటివి చేస్తే కోపం ఇట్టే తగ్గుతుంది. 

* కోపంగా ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త సరఫరా వేగంగా జరుగుతుంది. కనుక గట్టిగా గాలి పీలుస్తూ.. నెమ్మదిగా వదలండి. ఇలా చేస్తే ప్రయోజనం కలుగుతుంది. 

* కోపం వస్తే ఏం మాట్లాడుతారో తెలీదు. కాబట్టి అక్కడ ఉండకుండా బయటకు లేదా పక్కకు వెళ్ళండి. కోపం తగ్గాక ఎవర్నీ బాధపెట్టకుండా మాట్లాడండి.  

Trending News