Curd Sugar Benefits: పెరుగు, చక్కెర కలిపి తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Curd Sugar Benefits: ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెరుగు, చక్కెర కలిపి తినమని మన పేరెంట్స్ ఎప్పుడో ఒకప్పుడు చెప్పే ఉంటారు. అలా తినాలని చేసిన సూచన వెనుక చాలా బలమైన కారణం ఉంది. అలా పెరుగు, చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో పాటు శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 07:36 PM IST
    • పెరుగు, చక్కెర కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
    • జీర్ణక్రియ మెరగవ్వడం సహా శరీరానికి తక్షణ శక్తి!
    • దీని వల్ల అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది
Curd Sugar Benefits: పెరుగు, చక్కెర కలిపి తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Curd Sugar Benefits: ఏదైనా పని చేసే ముందు లేదా ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు పెరుగులో చక్కెర కలుపుకొని తినమని పెద్దలు సూచిస్తారు. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అలా తినడం వల్ల చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుందని నమ్మకం. ఎందుకంటే ఈ రెండింటిని తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు - చక్కెర కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

పెరుగు, చక్కెర తినడానికి కారణం ఏంటి?

కొన్ని నివేదికల ప్రకారం.. పెరుగు - చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది శరీరానికి గ్లూకోజ్ లా పనిచేస్తుంది. అలా తినడం వల్ల మీరు రోజంతా చురుకుగా ఉంటారు. దీంతో పాటు ఇది మంచి రుచిని కలిగి ఉంటుంది. అందుకే ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు పెరుగు - చక్కెర కలిపి తినమని ఇంట్లోని పెద్దలు సలహా ఇస్తుంటారు. 

పెరుగు - చక్కెర వల్ల కలిగే ప్రయోజనాలు

పెరుగు - చక్కెర కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. తద్వారా మీ కడుపులో ఎలాంటి సమస్యలు ఏర్పడవు. అంతే కాకుండా వేసవి కాలంలో పెరుగు, పంచదార తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. గ్లూకోజ్ తిన్నంత తక్షణ శక్తి శరీరానికి లభిస్తుంది. తక్కువ నీటిని తీసుకునే వారికి ఈ కాంబినేషన్ మేలు చేస్తుంది. వీటితో పాటు శరీరంలో ఏర్పడే అనేక రుగ్మతలను దూరం చేస్తుంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.) 

Also Read: Hair Fall Treatment: రోజూ ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే జుట్టు ఎప్పటికీ రాలిపోదు!

Also Read: Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీ తాగితే ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పవు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News