Coffee Side Effects On Stomach: చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం అలవాటుగా చేసుకుంటారు. కానీ, ఆరోగ్యపరంగా ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కొన్ని నష్టాలు కలుగుతాయని అంటున్నారు. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు:
ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తీసుకోవడం వల్ల కాఫీలోని ఆమ్లాల ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికను పెంచుతుంది. దీని వల్ల ఉదరపోట సమస్యలు రావచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట కాఫీ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మూత్రవిరేచకం, శరీరంలోని నీటిని బయటకు పంపిస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల అలసట, నీరసం వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఉదయం లేచిన వెంటనే కాఫీ తీసుకోవడం మంచికాదు.
అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ హెచ్చతగ్గులు రావచ్చు అని వారు చెబుతున్నారు. ఉదయానే కాఫీలో సమ్మేళనాలు కొన్ని మినరల్స్, ఐరన్,శోషణను అడ్డుకుంటాయని అంటున్నారు. కెఫిన్ ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం వల్ల గుండెల్లో మంటను పెంచుతుంది. కాబట్టి, ఖాళీ కడుపుతో కాఫీ తాగకుండా ఉండటం మంచిది. ఉదయం పాలు, పండ్లు, గుడ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినే తరువాత కాఫీ తాగడం మంచిది.
కొన్ని చిట్కాలు:
కాఫీ తాగడం తగ్గించుకోండి: రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగవద్దు.
కెఫిన్ ప్రభావాలను తగ్గించడానికి కాఫీ తాగవచ్చు.
ఆహారంతో పాటు కాఫీ తాగండి: పాలు, పండ్లు లేదా బిస్కెట్లు వంటి ఆహారంతో పాటు కాఫీ తాగండి.
నీరు ఎక్కువగా తాగండి: కాఫీ వల్ల కలిగే డీహైడ్రేషన్ నివారించడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగండి.
కాఫీని ఉదయం తీసుకోకుండా దానికి బదులుగా పోషకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోవడం మంచిది కాదు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి