Health Benefits: రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే.. ఏం జరుగుతుందంటే..?

Healthy Lifestyle: పడుకునే ముందు గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకుంటే.. కాళ్ళ కండరాలు రిలాక్స్ అవుతాయి.. ఫలితంగా కీళ్ల నొప్పులు దూరం అవ్వడమే కాదు పాదాలు సున్నితంగా తయారవుతాయి. అంతేకాదు రాత్రిపూట కాళ్లు కడుక్కోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. మరి అవేవో ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 1, 2024, 10:59 PM IST
Health Benefits: రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే.. ఏం జరుగుతుందంటే..?

Health Benefits.. సాధారణంగా పరిశుభ్రతను పాటించినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారు..అని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే . అయితే ఆరోగ్యకరమైన జీవితంలో చేతులు,  ముఖం , శరీరం శుభ్రంగా ఉంటే సరిపోదు.. పాదాలు కూడా శుభ్రంగా ఉండాలి. అందుకే బయటకు వెళ్లిన ప్రతిసారి ఇంట్లోకి వచ్చేటప్పుడు.. బయట పాదాలను శుభ్రం చేసుకొని రావాలి అని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలా పాదాలు శుభ్రం చేసుకోవడం వల్ల చాలా వరకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని.. ఎన్నో రకాల వ్యాధులను నివారించవచ్చు అని కూడా స్పష్టం చేస్తున్నారు..

సుఖ నిద్ర కోసం పాదాలు కడగాల్సిందే..

ఇకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే కావలసిన పోషకాలను.. అందించడమే కాదు మానసిక స్థితి, కంటి నిండా నిద్ర కూడా అవసరం. ఇక రోజంతా కష్టపడి రాత్రి తప్పనిసరిగా నిద్రపోతాం..అయితే అలా నిద్ర రావాలి అంటే కొన్ని నియమాలను మనం పాటించాలి. రోజువారి జీవితంలో భాగంగా చర్మాన్ని ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో.. పాదాల సంరక్షణ కూడా అంతే అవసరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పాదాలు శుభ్రంగా ఉండడం వల్ల ఆరోగ్యకరమైన నిద్ర రావడమే కాదు.. అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయట. అందుకే రాత్రి నిద్రించే ముందు తప్పనిసరిగా పాదాలను శుభ్రం చేసుకోవాలి .ఒకవేళ అపరిశుభ్ర పాదాలతో.. నిద్రిస్తే మాత్రం నిద్ర సరిగా పట్టదు సరి కదా.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకున్న వారం అవుతాం. పాదాలు శుభ్రం చేయకుండా నిద్రిస్తే సూక్ష్మక్రిములు పాదాల నుంచి.. శరీరం చేతులు  ద్వారా నోట్లోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. 

పాదాలు శుభ్రం చేయకుంటే వచ్చే రోగాలు ఇవే..

అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతాయి.. దురద, ఎరుపు,  పొట్టు, పగుళ్లు, పొక్కులు, వాపు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. పాదాల పగుళ్లు సర్వసాధారణమైనా  నిర్లక్ష్యం చేస్తే తీవ్రబాదను కలిగిస్తాయి. అందుకే ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసుకోవాలంటే రాత్రి నిద్రించే ముందు ఐదు నిమిషాలు మీరు మీ పాదాల కోసం కేటాయిస్తే ఎటువంటి రోగాలునైనా.. సరే ఇట్టే దూరం చేసుకోవచ్చు. నిద్రించేముందు కాళ్లు,  చేతులు శుభ్రం చేసుకొని ముఖాన్ని కూడా చన్నీటితో కడుక్కున్నట్లయితే సుఖనిద్ర మీ సొంతం అవుతుంది. అలాగే కండరాల నొప్పులు,  కీళ్ల నొప్పులు కూడా దూరం అవుతాయి.

Also Read: NTR Bharosa Scheme: జగన్‌, చంద్రబాబు అక్కడి నుంచే.. ఆ ఊరికి అంత ప్రత్యేకం ఏమిటి?

Also Read: TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News