Heat Wave And Heart Attack: వేసవి కారణంగా ఎండలు జోరుగా పెరుగుతున్నాయి. దీంతో ఏరోజుకారోజు ఉష్ణోగ్రతలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి అయితే చాలామందిలో ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా స్ట్రోక్ వచ్చిన వెంటనే అంతగా ప్రభావం నుంచి చూపకపోయినా కొన్ని రోజుల తర్వాత అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలామందిలో హీట్ స్ట్రోక్ కారణంగా గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఇటీవలే కొందరు నిపుణులు తెలిపారు. అలాగే శరీరంలోని నీటి పరిమాణాలు తగ్గిపోయి గుండెపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వారన్నారు. దీని కారణంగా గుండె సమస్యలే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. మనం నివసించే ప్రాంతాల్లో 40 ఉష్ణోగ్రతలకు పైగా ఎక్కువగా ఉంటే హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందట. కాబట్టి ఎక్కువ వేడిగా ఉండే ప్రదేశాల్లో నివసించే జనాలు తప్పకుండా ఈ సమయంలో పది రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ హిట్ స్ట్రోక్‌కి గురవడం వల్ల శరీరంలో అనేక రకాల క్షణాలు ఏర్పడతాయి. అయితే ఎవరెవరిలో ఎలాంటి లక్షణాలు ఏర్పడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హీట్ స్ట్రోక్ కారణంగా వచ్చే లక్షణాలు:
అలసట:
చాలామందిలో హిట్ స్ట్రోక్ వల్ల అలసట వచ్చే అవకాశాలు ఉన్నాయని.. దీని కారణంగా గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడి గుండెపోటు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి హీట్ స్ట్రోక్‌కి గురైన వారు ఎక్కువగా అలసిపోతే తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది లేకపోతే తొందరలోనే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తలనొప్పి:
వాతావరణం లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం కారణంగా కొంతమందిలో తలనొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా రక్తపోటు శాతం కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికే బీపీ సమస్యతో బాధపడే వారికి గుండెపోటు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుండెపోటు రాకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఎవరిలో ఎక్కువగా ఈ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది?
ఇటీవలే ఎంతమంది ఆరోగ్య నిపుణులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఇప్పటికే గుండెపోటు సమస్యలతో బాధపడుతున్న వారు హీట్ స్ట్రోక్‌కి గురయితే, తప్పకుండా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి ఇప్పటికే గుండెపోటు సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఎండలో తిరగకపోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ కచ్చితంగా వెళ్లాల్సి వస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్లడం ఎంతో మంచిదని వారంటున్నారు.
హీట్ స్ట్రోక్ నుంచి ఉపశమనం పొందడం ఎలా?
✿ తప్పకుండా రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది.
✿ నిమ్మకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
✿ ఈ స్ట్రోక్ రాకుండా ఉండడానికి తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి.
✿ ఆకుకూరలు పండ్లు ఎక్కువగా తినడం చాలా మంచిది.
✿ ఈ సమయంలో టైట్ గా ఉండే బట్టలను అస్సలు వేసుకోవద్దు.
✿ ఎక్కువగా ఎండలో తిరగకపోవడం చాలా మంచిది.
✿ ఇప్పటికే హిట్ స్ట్రోక్ లక్షణాలు ఉన్నవారు వైద్యులను తప్పకుండా సంప్రదించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి