Kharbooja Shake For Cancer Patients: వేసవి కాలం వచ్చిందంటే చాలు..పండ్లతో తయారు చేసిన డ్రింక్స్‌ను ఎక్కువగా తగడానికి ఇష్టపడతారు. ప్రతి రోజు ఆరోగ్యకరమైన డ్రింక్స్ తాగడం వల్ల శరీర హైడ్రేట్‌గా మారుతుంది. వేసవిలో క్రమం తప్పకుండా ఖర్బూజాతో తయారు చేసిన డ్రింక్స్ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఖర్బూజా డ్రింక్స్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఈ జ్యూస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఖర్బూజా షేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- 2 టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్
- ఖర్బూజా పండు
- పుదీనా ఆకులు
- జాజికాయ పొడి
- ఐస్ క్యూబ్స్
- చల్లని నీరు
మెలోన్ షేక్ ఇలా తయారు చేసుకోండి:
ఈ షేక్ చేయడానికి ముందుగా.. ఒక ఖర్బూజాను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పండుపై పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసిన ముక్కలను గ్రైడర్‌లో వేసి రసంలా తయారు చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పట్టుకున్న తర్వాత చల్లని నీరు పోసుకుని జ్యూస్‌లా తయారు చేయాలి. ఆ తర్వాత పుదీనా ఆకులు, జాజికాయ పొడి వేసి బాగా కలుపుకుని గ్లాస్‌లో తీసుకుని తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ షేక్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
వేసవి కాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గి తీవ్ర సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బీటా కెరోటిన్ అధిక పరిమాణంలో లభించే మెలోన్ షేక్ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా తగ్గిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధిగా మారుతోంది. కాబట్టి క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నవారు విటమిన్ బి-9 అధిక పరిమాణంలో లభించే మెలోన్ షేక్ తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి