Pumpkin Seeds Benefits For Weight Loss: గుమ్మడికాయ ఎక్కువగా భారతీయులు వంటకాల్లో వినియోగిస్తారు. దీనిని చాలా మంది కాశీరం అని కూడా అంటారు. అయితే దీనిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పండు కంటే ఇందులో ఉండే గింజలను తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నిజానికి గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో మెగ్నీషియం, జింక్, ఐరన్ మొదలైన పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటి నుంచి తీసిన గింజలను ప్రతి రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనవ తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
గుమ్మడికాయ గింజలను ప్రతి రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెరను సులభంగా నియంత్రించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఇన్సులిన్ స్థాయిలలో మార్పులు తీసుకువచ్చే యాంటీ-ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని స్నాక్స్‌లో వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాడం వల్ల బరువు తగ్గడమేకాకుండా బెల్లీ ఫ్యాట్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతి రోజూ గుమ్మడి గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సులభంగా నియంత్రిస్తుంది.
గుండెకు చాలా మంచివి:
గుమ్మడి గింజలను ఖాళీ కడుపుతో తినడం వల్ల గుండెకు చాలా రకాల ప్రయోనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజల్లో కొవ్వులు, ఫైబర్‌తో సహా అనేక యాంటీ-ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ గింజల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. కాబట్టి గుండె సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
ఈ గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా వీటి నుంచి తీసిన నూనెతో నొప్పులు ఉన్న ప్రదేశాల్లో మసాజ్ చేస్తే తీవ్ర నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook