Reheating Cooking Oil: ఇలా వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా.. అయితే ప్రమాదమే..!

Reheating Cooking Oil: ప్రస్తుతం భారతీయులు  ఆయిల్ ఫుడ్స్ తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇంట్లో లేదా బయట చాలా మంది నూనెలో వేయించిన వాటిని తినడానికి లైక్‌ చేస్తున్నాయని చాలా నివేదికలు తెల్చి చెప్పాయి. వీటిలో సమోసాలు, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చోలే భతురే, కచోరీలు, స్ప్రింగ్ రోల్స్, టిక్కీలు వంటివి ఎక్కువగా తింటున్నారని పేర్కొన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2022, 01:59 PM IST
  • నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల చాలా నష్టాలు
  • క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం
  • గుండె జబ్బులు పెరగడం
Reheating Cooking Oil: ఇలా వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా.. అయితే ప్రమాదమే..!

Reheating Cooking Oil: ప్రస్తుతం భారతీయులు  ఆయిల్ ఫుడ్స్ తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇంట్లో లేదా బయట చాలా మంది నూనెలో వేయించిన వాటిని తినడానికి లైక్‌ చేస్తున్నాయని చాలా నివేదికలు తెల్చి చెప్పాయి. వీటిలో సమోసాలు, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చోలే భతురే, కచోరీలు, స్ప్రింగ్ రోల్స్, టిక్కీలు వంటివి ఎక్కువగా తింటున్నారని పేర్కొన్నాయి. అయితే వీటిని పాన్‌లో వేయించినప్పుడు చాలాసార్లు నూనె మిగిలిపోయి ఉంటుంది. దానిని వృధా చేయకుండా ఉండటానికి మనం మళ్లీ ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల  శరీరానికి హాని కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వంటనూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల కలిగే నష్టా గురించి గ్రేటర్ నోయిడాలోని జిమ్స్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ 'ది పవర్ ఆఫ్ హెల్త్' ద్వారా ఇవిధంగా తెలిపారు.

నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల కలిగే నష్టాలు:

వంట నూనెను వేడి చేసి పదే పదే ఉపయోగిస్తుంటే.. విషపూరిత పదార్థాలు ఏర్పడతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరం తీవ్రంగా దెబ్బతింటుంది. నిజానికి, ఎడిబుల్ ఆయిల్‌ను మళ్లీ ఉపయోగించడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ సమస్య పెరిగి శరీరంలో మంటలకు దారి తీసే అవకాశం ఉంది.

1. క్యాన్సర్ ప్రమాదం:

వంట నూనెను మళ్లీ వేడి చేసి వాడడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే దీని కారణంగా శరీరంలోని చాలా చోట్ల మంట పెరిగి.. ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2. BP ఒక్కసారిగా పెరడం:

వంట నూనెను అధికంగా వేడి చేసినప్పుడు.. రసాయన కూర్పు మారుతుంది. ఇది శరీరంలో కొవ్వు ఆమ్లాలు, రాడికల్స్‌ను విడుదల చేస్తుంది. ఆ తరువాత అధిక రక్తపోటుకు కారణం అవుతుంది.

3. గుండె జబ్బులు పెరగడం:

వంట నూనెను అధికంగా వేడి చేసి వండడం వల్ల వింత రకమైన పొగ వెలువడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌కు కారణం అవుతుంది. గుండెపోటు, పక్షవాతం, ఛాతీ నొప్పికి దారితీస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Read also: TRS VS BJP: అమిత్ షా, యోగీ ఫైర్.. ప్రధాని మోడీ సైలెంట్! కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ ఖతర్నాక్ స్కెచ్చేసిందా?

Read also:  MP Raghurama Raju: అరెస్ట్ భయంతో భీమవరం వెళ్లని ఎంపీ రఘురామ.. ప్రధాని సభకు డుమ్మా! వైసీపీ దెబ్బ మాములుగా లేదుగా..  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News