Raw Tomatoes: పచ్చి టమాటాల ప్రయోజనాలు…అందానికి సైతం ఔషధం..

Tomatoes:టమాటా అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఎర్రగా ఉన్న టమాటా పండు. దీన్ని మనం కూరల్లో, సలాడ్స్ లో విరివిగా వాడుతాం. అయితే పచ్చి టమాటో తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు మీకు తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2024, 09:45 PM IST
Raw Tomatoes: పచ్చి టమాటాల ప్రయోజనాలు…అందానికి సైతం ఔషధం..

Green Tomatoes: టమాటో.. కూరల దగ్గర నుంచి సలాడ్స్ వరకు.. శాండ్విచ్ దగ్గర నుంచి బిర్యానీ వరకు.. కచ్చితంగా ఉండాల్సిన కూరగాయ. మనలో చాలామందికి బాగా మాగిన టమాటాలో చక్కెర కలుపుకొని తినడం కూడా ఇష్టమే. దీంతో పచ్చడి దగ్గర నుంచి ఊరగాయ వరకు చేసుకుంటాం. టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది అన్న విషయం మనకు తెలుసు. అయితే పచ్చి టమాటో తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా. అవునండి బాబు.. వినడానికి విచిత్రంగా ఉన్న గ్రీన్ టమాటో లో ఎన్నో బెనిఫిట్స్ దాగి ఉన్నాయి.

గ్రీన్ టమాటో తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది అంటున్నారు నిపుణులు. పచ్చి టమాటాలు క్యాల్షియం ,పొటాషియం, విటమిన్ సి, ఏ తో పాటుగా ఫైటో కెమికల్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇది మన శరీరానికి అవసరమైనటువంటి పౌష్టిక తత్వాలను అందిస్తాయి. ఇందులో సమృద్ధిగా దొరికే కాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. అందుకే చిన్న పిల్లలకి అప్పుడప్పుడు ఈ పచ్చ.. పచ్చి టమాటాలు తినిపించడం వల్ల వాళ్ళ ఎముకలు బలంగా తయారవుతాయి.

గ్రీన్ టమాటోస్ లో బీటా కెరటిన్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. దీనివల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగవుతుంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజుకు ఒక చిన్న గ్రీన్ టమాటో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు గ్రీన్ టమాటో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారడమే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా, బలంగా పెరుగుతుందట. అంటే ఈ టమాటాలు తినడం ద్వారా మనం ఎంతో అందంగా కూడా ఉండొచ్చు.

పచ్చి టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. ఇది పలు రకాల ఇన్ఫెక్షన్స్ను దూరం పెడుతుంది. అంతేకాదు క్యాన్సర్ సంబంధిత కణాలను నివారించడంలో కూడా పచ్చ టమాటాలు ఉపయోగపడతాయట. హాయ్ బేబీ ఉన్నవాళ్లు ఇది తినడం వల్ల బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సీజనల్ వ్యాధులు మన దరిచేరకుండా కాపాడడంలో గ్రీన్ టమాటో ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఇన్ని సుగుణాలు ఉన్న గ్రీన్ టమోటా ను నేరుగా ఎలా తినాలి అని ఆలోచిస్తున్నారా?

గ్రీన్ టమాటో చూడడానికి బాగుంటుంది కానీ తినడానికి బాగా పుల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని చిన్న ముక్కలు చేసి సలాడ్ వంటి వాటిల్లో కలిపేయవచ్చు. పచ్చి టమాటాలను కూరల్లో, సూప్స్ లో, స్మూతీస్ లో వాడుకోవచ్చు. లేదా నేరుగా కూడా కాస్త ఉప్పు ,కారం చల్లుకొని తినవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ టమోటా ను మీ డైట్ లో భాగంగా చేసుకోండి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Also Read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్‌.. టీజర్‌లో 'గాజు గ్లాస్‌' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!

Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్‌.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News