Butter Milk Side Effects: ఎండలు మండిపోతున్నాయి. దాహార్తిని తీర్చుకోవడానికి మనం చల్లని ఆహార పదార్థాలవైపు పరుగెడుతాం. చల్లని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం, లస్సీ, మజ్జిగను తీసుకుంటాం. సాధారణంగా మన పూర్వీకులు ఎండకాలం ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే మజ్జిగ మొదటగా ఇచ్చేవారు. ఇది వడదెబ్బ తగలకుండా మనం డీహైడ్రేషన్ లోనవ్వకుండా కాపాడుతుంది. అంతేకాదు మజ్జిగ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.అయితే, ఏదైనా అతి మనకు చేటును చేస్తుంది. ఎండకాలం మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో తెలుసుకుందాం.
మజ్జిగలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, సోడియం, ఫైబర్, విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటాయి. అయితే, ఇందులో మనం ఉప్పు వేసుకుంటాం. దీంతో తక్కువ కొవ్వు, అధిక సోడియం ఉంటుంది. దీంతో ఇది మన శరీరంపై సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది.
అయితే, మజ్జిగను కిడ్నీ సమస్యలు ఉంటే తీసుకోకూడదు. ఇందులో సోడియం ఉంటుంది. ఎందుకంటే ఇలా సోడియం ఉన్న పదార్థాలు కిడ్నీ బాధితులు తీసుకోవడం మంచిది కాదు. అంతేకాదు కొంతమంది పిల్లల్లో గొంతు ఇన్ఫెక్షన్‌కు కూడా దారితీస్తుంది. ఇందులో ఉండే లాక్టోజ్ వల్ల కొంతమందికి డయేరియా, గ్యాస్ కడుపు సంబంధిత వ్యాధులు వస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా మజ్జిగను తీసుకోకూడదు.
ఇదీ చదవండి: డయాబెటిస్ రాక ముందే శరీరంలో వచ్చే లక్షణాలు ఇవే.. వీటిని అస్సలు విస్మరించవద్దు!
మజ్జిగ జలుబు సమస్య ఉన్నప్పుడు మరీ ఎక్కువ చేస్తుంది. దీంతో సమస్యతో అతిగా బాధపడాల్సి ఉంటుంది. అంతేకాదు మీకు తామర వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా మజ్జికకు దూరంగా ఉండాలి. ఇది వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాదు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు కూడా మజ్జిగను తీసుకోకూడదు. ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది మన శరీరంలో మరింత కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. చర్మంపై కూడా మజ్జిగను వాడకూడదు. ఇది దురద సమస్యను పెంచుతుంది. జ్వరంతో బాధపడేటప్పుడు కూడా మజ్జిగ వినియోగించకూడదు. ఇది చల్లదనాన్ని ఇస్తుంది.కానీ, జ్వరం సమయంలో మజ్జిగను వినియోగించకూడదు.
ఇదీ చదవండి: రాగులతో ఇలా ఈజీగా బరువుతగ్గండి.. వీరు మాత్రం అస్సలు ముట్టకూడదు..
రాత్రి సమయంలో మజ్జిగ తీసుకోకూడదని నిపుణులు చెబుతారు. ఇది ఆరోగ్యపరంగానే కాదు మన నమ్మకాల ప్రకారం రాత్రి పడుకునే పూట పెరుగు, మజ్జిగ తాగకూడదు. దీంతో ఆయుష్షు కూడా తగ్గిపోతుందని అందుకే రాత్రి పూట పెరుగు, మజ్జిగలు నిషేధించబడింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook