Mastalgia and Breast Cancer: కేన్సర్ అత్యంత ప్రమాదరమైన, ప్రాణాంతక వ్యాధి. ఈ నేపధ్యంలో బ్రెస్ట్ కేన్సర్, మాస్టాల్జియాల మధ్య ఉన్న తేడా గురించి తెలుసుకోవల్సిన అవసరముంది. రెండింటికీ తేడా ఏంటి, ఎందుకొస్తుందనేది పరిశీలిద్దాం..
అన్ని గడ్డలు కేన్సర్ కాకపోయినా జాగ్రత్త వహిస్తే కేన్సర్ నివారణ సాధ్యమే. అందుకే శరీరంపై కన్పించే గడ్డల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళల్లో కన్పించే మాస్టాల్జియా విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఎందుకంటే రొమ్ము కేన్సర్..మాస్టాల్జియా లక్షణాలు కాస్త ఒకేలా ఉంటాయి.
మాస్టాల్జియా అంటే ఏమిటి
స్త్రీ రొమ్ము భాగంలో వచ్చే నొప్పుల్ని మాస్టాల్జియా అంటారు. మాస్టాల్జియా అనేది సాధారణంగా ఐదు రకాలుగా ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా కొంతమంది స్త్రీల రొమ్ముల్లో గడ్డలు ఏర్పడతాయి. ఇవి స్కిన్‌పై నుంచి కదులుతుంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు వీటి పరిమాణం పెరుగుతుంది. శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. రెండవది పాలిచ్చే తల్లుల రొమ్ముల్లో ఉండే ఓ రకమైన నొప్పి. వైద్య పరిభాషలో దీనిని బ్రెస్ట్ టిష్యూ ఇన్‌ఫెక్షన్ అంటారు. బేబీ నోట్లోని బ్యాక్టీరియా రొమ్ములో వెళ్లడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఇది కణితిలా మారకముందే...వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.
ఇక మూడవ మాస్టాల్జియా రకం..పీరియడ్స్ సమయంలో స్త్రీలలో కన్పించే రొమ్ము నొప్పులు. ఇది కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా వచ్చే నొప్పి. ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్‌లో భాగమిది. పీరియడ్ తరువాత దానంతటదే తగ్గిపోతుంది. కాబట్టి ఈ మూడవ రకం మాస్టాల్జియా విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఇక మరో రకం మాస్టాల్జియా తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా ఏర్పడే రొమ్ము నొప్పులు. అంటే తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువైనా, కెఫీన్ వంటి పదార్ధాలు తీసుకున్నా...వాల్‌నట్స్, బాదం, చాక్లెట్స్ తీసుకుంటే రొమ్ము నొప్పి వస్తుంది. అందుకే ఏ ఆహార పదార్ధాలు మంచివో కావో తెలుసుకోవాలి. లేదా వైద్యుడిని సంప్రదించాలి.
ఇక ఐదవ రకం రొమ్ము నొప్పులు లేదా మాస్టాల్జియా సిస్టులు. స్త్రీ రొమ్ముల్లోని కణజాలంలో ఏర్పడతాయి. ఇది బ్రెస్ట్ కేన్సర్ కారకం కాదు గానీ..వైద్యుడి సలహాతో చికిత్స చేయించుకోవడం మంచిది. ఏదేమైనా బ్రెస్ట్ పెయిన్ అంటే కేన్సర్ అని భయపడే పరిస్థితులు లేకపోలేదు. అలాగని అన్ని నొప్పులు కేన్సర్ కారకాలు కూడా కావు. అందుకే రొమ్ము నొప్పులు తరచూ వేధిస్తుంటే వైద్యుడి సలహా తీసుకోవడం అత్యుత్తమం. అందుకే మాస్టాల్జియా లక్షణాలు కన్పించినా అప్రమత్తమై..వైద్యుడి వద్ద పరీక్ష చేయించుకోవడం అవసరం.
Also read: Jamun Benefits: నేరేడు పండ్ల ప్రయోజనాలేంటి, నేరేడు పండు తిన్న వెంటనే నీళ్లు తాగవచ్చా
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook