/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో ఉన్న వ్యక్తుల్లో చాలా మంది పాజిటివ్ లక్షణాలతో ఉన్నారు.  

ఇప్పటి వరకు మొత్తం 2 వేల 361 మందిని మర్కజ్ భవనం నుంచి బయటకు తీసుకువచ్చారు. వారిలో మొత్తంగా 617 మంది కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే దీనిపై పూర్తిగా  పరీక్షల నివేదికలు  రావాల్సి ఉంది. ఇప్పటికే  ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో వారిని చేర్పించారు. మిగితా అందరినీ క్వారంటైన్లకు తరలించారు. 

ఢిల్లీలో వైద్య సిబ్బంది, అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు మొత్తంగా దీని కోసం  36  గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. వారందరినీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అభినందించారు. వారందరూ తమ జీవితాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించారని కితాబిచ్చారు.

'కరోనా వైరస్' గురించి మరో భయంకరమైన నిజం..!!

మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల  కోసం ఢిల్లీలో మొత్తంగా వెయ్యి పడకలతో ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. లోక్ నాయక్, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సిద్ధం చేసినట్లు వివరించారు.

 అటు నిజాముద్దీన్ మర్కజ్ భవనం వద్ద సౌత్ ఢిల్లీ మున్సిపల్ సిబ్బంది శానిటైజేషన్ నిర్వహించారు. మర్కజ్ భవనం ప్రాంతంలోని అన్నింటినీ శానిటైజ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా దుస్తులు ధరించి శానిటైజేషన్ నిర్వహిస్తున్నారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
2,361 people evacuated from Delhi nizamuddin markaz building out of which 617 are coronavirus symptoms
News Source: 
Home Title: 

ఢిల్లీలో 'మర్కజ్' అలజడి

ఢిల్లీలో 'మర్కజ్' అలజడి
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఢిల్లీలో 'మర్కజ్' అలజడి
Publish Later: 
No
Publish At: 
Wednesday, April 1, 2020 - 11:49