కర్నాటకలో ( Karnataka ) కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడి పెట్టిన చేసిన అభ్యంతర పోస్టు బెంగుళూరులో విధ్వంసం సృష్టించింది. ఎమ్మెల్యే ఇంటిపై దాడి..అల్లర్లు చెలరేగాయి. ఈ నేపధ్యంలో డీజే హళ్లిలోని ( DJ Halli ) ఓ ఆలయాన్ని రక్షించేందుకు ముస్లిం యువకులు మానవహారం నిర్మించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ( Congress MLA srinvas murthy ) మేనల్లుడు ఇస్లాం మత ప్రవక్త మొహమ్మద్ ( Prophet mohammad in Islam ) పై అభ్యంతరకర పోస్టు చేయడం పెద్దఎత్తున వివాదానికి కారణమైంది. ఈ పోస్టుకు ఆగ్రహించిన ఓ వర్గం ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడమే కాకుండా...ఇంటికి నిప్పు పెట్టింది. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. బెంగుళూరు నగరంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు ( Arsons in bengaluru ) చెలరేగాయి. పోలీసుల వాహనాలు నిప్పుకు ఆహుతయ్యాయి. రంగంలో దిగిన పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. దాదాపు 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
ఈ నేపధ్యంలోనే నగరంలోని డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. డీజే హళ్లిలోని ఓ ఆలయాన్ని దుండగుల నుంచి కాపాడేందుకు ముస్లిం యువకులు కొంతమంది గుడి చుట్టూ మానవహారం ( Human chain around a temple ) నిర్మించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందూ ముస్లిం భాయీ భాయీ సందేశంతో పాటు మత సామరస్యదతను చాటుతోంది. అందుకే నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
#WATCH Karnataka: A group of Muslim youth gathered and formed a human chain around a temple in DJ Halli police station limits of Bengaluru city late last night, to protect it from arsonists after violence erupted in the area. (Video source: DJ Halli local) pic.twitter.com/dKIhMjQh96
— ANI (@ANI) August 12, 2020
కాగా..వివాదాస్పద పోస్టుతో ఘర్షణకు కారణమైన ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నగరంలో ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ పోలీసులు 110 మందిని అరెస్టు చేశారు.