Young Wildlife Photographer 2021 award: బెంగళూరు బాలుడికి అంతర్జాతీయ యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ అవార్డు!

ఈ ఏడాది ప్రతిష్టాత్మక 'యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' పురస్కారం బెంగళూరు బాలుడిని వరించింది. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 02:25 PM IST
Young Wildlife Photographer 2021 award: బెంగళూరు బాలుడికి అంతర్జాతీయ యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ అవార్డు!

Young Wildlife Photographer 2021 award: 2021 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘'యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'(Young Wildlife Photographer 2021 award) అవార్డును బెంగళూరుకు చెందిన 10 యేళ్ల విద్యున్‌ ఆర్‌ హెబ్బర్‌(Vidyun R Hebbar) అనే బాలుడు అందుకున్నాడు.

 ఈ బాలుడు తీసిన తలకిందులుగా ఉన్న సాలెగూడు(Spider Tent) ఫొటోకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఫొటో బ్యాక్‌ గ్రౌండ్‌లో ప్రకృతి రంగులు అందంగా అద్దినట్టు అద్భుతంగా తీశాడు. దీనిని డోమ్‌ హోమ్‌ అని అంటారు. తన ఇంటి సమీపంలో ఉన్న వీధుల్లో, పార్కుల్లో నివసించే  జీవులను ఫోటో తీయడం ఇష్టమని, ఎనిమిదేళ్ల వయసులో ఈ పోటీలో మొదటిసారి పాల్గొన్నానని హెబ్బర్‌ మీడియాకు తెలిపాడు.

Also Read: Viral Video: ఏనుగు కోపాన్ని చూసి..మీరు తట్టుకోగలరా?

లండన్‌కి చెందిన మ్యూజియం ఆఫ్‌ న్యాచురల్‌ హిస్టరీ(London's Natural History Museum) 1965 నుంచి ఈ పోటీ నిర్వహిస్తోంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేచర్‌ ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌గా పేర్కొంటారు. ఈ ఈవెంట్‌కి 95 దేశాల నుంచి దాదాపుగా 50,000ల ఎంట్రీలు వచ్చాయి. 19 కేటగిరీల్లో నిర్వహించిన పోటీలో విజేతల ఫలితాలను మంగళవారం ప్రకటించారు. గెలుపొందిన వారిలో మన దేశం తరపున విద్యున్‌ ఆర్‌ హెబ్బర్‌ అవార్డు అందుకోవడం దేశానికే గర్వకారణం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News