భారతదేశంలోనే అత్యుత్తమ హిందూ మత పరిరక్షణ సంస్థగా పేరొందిన 'అఖిల భారతీయ అకారా పరిషత్' 17 మంది దొంగాబాబాలు, స్వామీజీల జాబితాను అధికారికంగా ప్రకటించింది. 8వ శతాబ్ద కాలంలో సాక్షాత్తు ఆది శంకరాచార్య తరం నుండి వారసత్వంగా సంప్రదాయాలను కొనసాగిస్తున్న సంస్ధగా అకారా పరిషత్‌కు పేరుంది. ఇటీవలే ఈ సంస్థ హిందుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్న కొందరు స్వాములుగా చెలమాణీ అవుతున్నారని.. వీరిని నమ్మవద్దని ఒక జాబితాని ప్రకటించింది. వీరి పట్ల సామన్య జనులు అప్రమత్తతతో ఉండాలని కూడా తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కుంభమేళా కార్యక్రమంలో అకారా ప్రముఖలు కూడా ప్రముఖ పాత్రను పోషించడం జరుగుతోంది. ఈ పరిషత్ ప్రకటించిన జాబితాలో ఆశారాంజీ బాపూ, రాధేమా, గుర్మీత్ రామ్ రహీం సింగ్‌తో పాటు బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన స్వామీ ఓంజీ, వీరేంద్ర దేవ్ దీక్షిత్, సచ్చిదానంద సరస్వతి, త్రికాల్ భవంత్, సచ్చిదానంద గిరి, నిర్మల్ బాబా, ఇచ్చాధారి భీమానంద్, స్వామీ అసీమానంద్, నారాయణ్ సాయి, రాంపాల్ బాబా, ఆచార్య కుష్ముని, బ్రహస్పతి గిరి, ఓం నమహ శివాయ్ బాబా, మల్కన్ సింగ్ తదితరులు ఉన్నారు.