Bihar Exit Poll Result 2020: బిహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 2020, బీహార్ కొత్త సీఎం ఎవరు ?

Bihar Exit Poll Results 2020: పాట్నా: బీహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేటితో పోలింగ్ ముగిసింది. నేటి సాయంత్రం 4 గంటలతో బీహార్‌లో చివరి విడత ముగియడంతో ఇక అందరి దృష్టి అంతా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే పడింది. ఏబీపీ-సీ-ఓటర్, న్యూస్ 18-టుడేస్ చాణక్య, ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా ( ABP-C-Voter, News 18-Today’s Chanaky, India Today-Axis My India ) తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.

Last Updated : Nov 7, 2020, 11:24 PM IST
Bihar Exit Poll Result 2020: బిహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 2020, బీహార్ కొత్త సీఎం ఎవరు ?

Bihar Exit Poll Results 2020: పాట్నా: బీహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేటితో పోలింగ్ ముగిసింది. నేటి సాయంత్రం 4 గంటలతో బీహార్‌లో చివరి విడత ముగియడంతో ఇక అందరి దృష్టి అంతా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే పడింది. ఏబీపీ-సీ-ఓటర్, న్యూస్ 18-టుడేస్ చాణక్య, ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా ( ABP-C-Voter, News 18-Today’s Chanaky, India Today-Axis My India ) తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. 2015లో ఇలాగే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించినప్పుడు యాక్సిస్ ఏపీఎం మాత్రమే మహాఘట్‌బంధన్‌కి మెజార్టీ వస్తుందని చెప్పింది తప్ప మిగతా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అన్నీ బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ సునాయసంగా విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ ఫలితాలు వెల్లడయ్యాకా చూస్తే.. అందరికీ షాక్ ఇస్తూ మహా కూటమి 180 స్థానాల్లో విజయం సాధించింది.

Also read : Hyderabad Cinema city: కేసీఆర్‌ని కలిసిన చిరు, నాగ్.. 1500-2000 ఎకరాలతో సినిమా సిటీ

ఇక బీహార్ 2020 ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఓసారి విశ్లేషిస్తే.. యాక్సిస్ ఏపీఎం మహా కూటమికి 169-183 స్థానాలు వస్తే.. ఎన్డీఏ కూటమికి 58-70 స్థానాలు గెల్చుకుంటుందని వెల్లడించింది. అలాగే టూడేస్ చాణక్య అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే... బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏకి 144-166 స్థానాలతో 2/3 మెజారిటీ సొంతం చేసుకుంటుందని పేర్కొంది. 

బీహార్‌లో ఈసారి హంగ్ ( Hung in Bihar ) ఏర్పడుతుందని టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే అభిప్రాయపడింది. ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమికి 120 స్థానాలు గెల్చుకుంటుందని అంచనా వేసిన టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే.. ఎన్డీఏకి 116 స్థానాలు వస్తాయని పేర్కొంది. లోక్‌ జన శక్తి ( LJP)కి కేవలం ఒక్క స్థానం మాత్రమే దక్కుతుందని చెప్పడం గమనార్హం. 

Also read : PSLV-C49 mission అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News